సినిమా సినిమాకూ మధ్య కొంత గ్యాప్ తీసుకోవడం అడివి శేష్ (Adivi Sesh)కు అలవాటు. అనుకోకుండా జరిగిందా? లేదంటే మరొకటా? అనేది పక్కన పెడితే... హీరోగా ఆయన సినిమాల మధ్య ఏడాది లేదా రెండేళ్ల గ్యాప్ అయితే ఉంటుంది. ఈసారి అటువంటి గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నారీ యంగ్ హీరో. 'డెకాయిట్' తర్వాత రెండు సినిమాలను లైనులో పెట్టారు.

Continues below advertisement

'గూఢచారి' సీక్వెల్ తర్వాత...స్నేహితుడితో అడివి శేష్ సినిమా!Adivi Sesh Next Movie After Goodachari 2: ఏప్రిల్ 10, 2026న 'డెకాయిట్' సినిమా విడుదల. మరి, ఆ తర్వాత? ఆల్రెడీ ఓ సినిమా సెట్స్ మీద ఉంది. తన సూపర్ హిట్ సినిమా 'గూఢచారి'కి సీక్వెల్ 'గూఢచారి 2' (G2 Movie) చేస్తున్నారు శేష్. మే 1న ఆ సినిమా విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే, ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అన్ని పనులూ పూర్తి అయితే సమ్మర్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. 'గూఢచారి 2' తర్వాత? తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

Also Read: డెకాయిట్ vs హిట్ 2... డబుల్ మార్జిన్‌తో బిజినెస్, అడివి శేష్ లాస్ట్ 5 ఫిలిమ్స్ మార్కెట్ తెలుసా?

Continues below advertisement

'డెకాయిట్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తామిద్దరం కలిసి సినిమా చేస్తున్నామని అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'జీ 2' పూర్తి అయ్యాక తన సినిమా సెట్స్ మీదకు వెళుతుందని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. రష్మికా మందన్న ప్రధాన పాత్రలో రూపొందిన 'ది గర్ల్ ఫ్రెండ్' తర్వాత ఆయన చేయబోతున్న చిత్రమిది. 'చిలసౌ'తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్, ఆ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Raaka: రాకా అంటే ఏమిటి? టైటిల్ మీనింగ్, బాలీవుడ్ & కామిక్ రిఫరెన్స్‌లు తెలుసా?

అడివి శేష్, రాహుల్ రవీంద్రన్, సుజీత్, 'వెన్నెల' కిశోర్... నలుగురూ స్నేహితులు. వాళ్ళది ఓ గ్యాంగ్. అడివి శేష్ ప్రతి సినిమానూ తన స్నేహితులకు ముందు చూపిస్తారు. 'డెకాయిట్'ను కూడా అలా చూపించారట. సినిమా బావుందని రాహుల్ రవీంద్రన్, 'వెన్నెల' కిశోర్ చెప్పారు. 

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె