బాలీవుడ్‌ హీరోయిన్  పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్‌మెంట్‌ కన్నుల పండుగగా జరిగింది. ఢిల్లీ కపుర్తాలా హౌస్‌లో మే 13 (శనివారం) సాయంత్రం వేళ వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది  సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ ఈ కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. త్వరలో మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.  ఈ సంవత్సరం చివరి నాటికి వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు సన్నిహిలు తెలిపారు. పరిణీతి, రాఘవ్ నిశ్చితార్థం నేపథ్యంలో వీరి ఆస్తులు, అంతస్తుల గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ వారి నెట్ వర్త్ ఏంతో  ఇప్పుడు తెలుసుకుందాం..


రాఘవ్ ఆస్తుల విలువ ఎంతంటే?


పరిణీతి,  రాఘవ్ వాస్తవానికి లాభదాయకమైన రంగాల్లో కొనసాగుతున్నారు. ఆయా రంగాల నుంచి బాగానే డబ్బు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది? వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం..  రాఘవ్ రాజకీయ నాయకుడే కాకుండా చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. అతను డెలాయిట్, శ్యామ్ మల్పానీ,  గ్రాంట్ థార్న్టన్ లాంటి అకౌంటెన్సీ సంస్థలలో పని చేశారు.  అయినా, తను చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్‌ ప్రెస్ నివేదిక ప్రకారం అతడి నికర ఆస్తుల విలువ  రూ.50 లక్షలు.   రాఘవ్ దగ్గర మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు మాత్రమే ఉంది. రూ. 4.95 లక్షల విలువైన 90 గ్రాముల ఆభరణాలు ఉన్నాయి. రూ. 37 లక్షల నగదును కలిగి ఉన్నారు.


పరిణీతి ఆస్తులు విలువ ఎక్కువే!  


రాఘవ్ ఆస్తులతో పోల్చితే పరిణీతి చోప్రా నికర ఆస్తుల విలువ చాలా ఎక్కువ. పలు నివేదికల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 60 కోట్లు. ఆమె ఆదాయానికి సంబంధించిన ముఖ్యమైన వనరులు సినిమాలు, ఎండార్స్ మెంట్లు. ముంబైలో పరిణీతికి లగ్జరీ సీ ఫేస్ ఫ్లాట్ ను కలిగి ఉంది.  ఆడి A6, జాగ్వార్ XJL, ఆడి Q5,  జాగ్వార్ XJLలతో సహా అనేక హై-ఎండ్ కార్లను కలిగి ఉంది.   


Also Read : సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు 11 ఏండ్ల తర్వాత మళ్లీ విచారణ, శిక్ష ఖరారు అయ్యేది ఎప్పుడో?


పరిణీతి, రాఘవ్ మధ్య ప్రేమ ఎలా ఏర్పడిందంటే?


పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరి ద్వారా పరిచయం పెరిగింది. అదికాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కొద్ది కాలం క్రితమే ఈ విషయం బయటకు తెలిసింది.  వీరిద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం ప్రచారం జరిగింది. ఆప్ ఎంపీ వీరి పెళ్లి గురించి చెప్పడంతో, ఆ వార్తలు వాస్తవాలేనని తేలిపోయాయి.


Read Also: రియల్ లైఫ్‌లో శ్రీమంతుడిలా శివన్న దంపతులు - కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలను...