Radhika Apte about Tollywood Heroes: ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలామంది భామలు.. ముందుగా టాలీవుడ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయినవారే. కంగనా రనౌత్ నుండి తాప్సీ పన్ను వరకు చాలామంది భామలు ముందుగా తెలుగులోనే హీరోయిన్స్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుంటూ అక్కడ స్టార్లుగా సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో ఒకరు రాధిక ఆప్టే. మామూలుగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయినవారు తెలుగు సినీ పరిశ్రమ గురించి తక్కువ చేసి మాట్లాడడం కామన్ అయిపోయింది. తాజాగా రాధిక కూడా అదే చేసింది. తను టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ..


రాధిక ఆప్టే ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. తనకు నచ్చని విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తూ కాంట్రవర్సీలను అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటుంది ఈ భామ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రక్త చరిత్ర’తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ తర్వాత బాలకృష్ణలాంటి స్టార్ హీరోతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ఆ తర్వాత తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ తను ఓటీటీ స్టార్ అయిపోయింది. ఎన్నో ఓటీటీ ఒరిజినల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా తనను నటిగా పరిచయం చేసిన టాలీవుడ్‌పైనే కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసింది రాధికా.


మేల్ డామినేషన్ ఎక్కువ..


‘‘నేను చాలా కష్టపడిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్. ఆ ఇండస్ట్రీలో మగవారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆడవారిని ట్రీట్ చేసే పద్ధతి అసలు భరించలేని విధంగా ఉంటుంది. సినిమాల్లో కూడా హీరోను దేవుడిలాగా చూడడం వరకే వారి పాత్ర పరిమితమవుతుంది. సెట్స్‌లో కూడా నువ్వు ఎవరో అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. హీరోలను మాత్రం ఎవరూ ఏమీ అడగరు. హీరోల మూడ్‌ను బట్టే అందరూ ప్రవర్తిస్తారు. అక్కడ నేను నిరంతరం కష్టపడ్డాను. అందుకే దానికి ఎండ్ చెప్పేశాను’’ అంటూ తను తెలుగు సినిమాల్లో నటించకపోవడంపై కారణం బయటపెట్టింది రాధిక ఆప్టే. ఇది విన్న తెలుగు ప్రేక్షకులు తనపై ఫైర్ అవుతున్నారు.






అప్పట్లో బాలయ్యపై వ్యాఖ్యలు..


సీనియర్ హీరో బాలకృష్ణతో కలిసి రాధిక ఆప్టే చేసిన ‘లెజెండ్’ మూవీ తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సినిమా సమయంలో బాలయ్య ప్రవర్తన తనకు నచ్చలేదని చెప్పి ఇప్పటికే తెలుగు ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేసిన రాధిక.. మరోసారి టాలీవుడ్‌పైన, ఇక్కడి హీరోలపైన చేసిన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యి.. ఇక్కడే యాక్టింగ్ నేర్చుకొని.. ఇతర భాషల్లో వెళ్లి స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్లకు టాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాధికకు బాలీవుడ్‌లో ఫేమ్ రావడంతో కావాలనే టాలీవుడ్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: ‘పూలమ్మే పిల్లా’ పాటకు బుల్లి ఫ్యాన్స్ కవర్ సాంగ్ - తేజ స‌జ్జ‌ స్పందన ఇది!