Devara Vs Kalki: సేమ్ టు సేమ్ - ‘కల్కీ’ని తలపిస్తున్న ‘దేవర’

Devara Vs Kalki: 'దేవర 1' సినిమా నుంచి వచ్చిన ఎన్టీఆర్ స్టిల్ ను.. 'కల్కి 2898 AD' లోని ప్రభాస్ స్టిల్ లో కంపేరిజన్స్ మొదలయ్యాయి.

Continues below advertisement

Devara Vs Kalki: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ కోసం ముందుగా ఏప్రిల్ 5వ తేదీని ఫిక్స్ చేసుకున్న మేకర్స్.. ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తారక్ సెకండ్ రోల్ కు సంబంధించిన లుక్ ను ఆవిష్కరించారు. అయితే ఇది సరిగ్గా 'కల్కి 2898 A.D' లోని ప్రభాస్ ఫస్ట్ లుక్ ను పోలి ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Continues below advertisement

'దేవర' పార్ట్ 1 రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఎన్టీఆర్ కదన రంగంలో దూకిన టైగర్ మాదిరిగా కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ సెటప్ చూస్తుంటే, ఇది మట్టి కుస్తీలో భాగంగా జరిగే ఫైట్ సీన్ లోని స్టిల్ అని తెలుస్తోంది. 'కల్కి 2898 AD' ఫస్ట్ లుక్ లో ప్రభాస్ స్టిల్ కూడా కూడా దాదాపు ఇలానే ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ కు తగ్గట్టుగా రెబల్ స్టార్ ఒక వారియర్ గా బరిలోకి దూకుతున్నట్లుగా కనిపిస్తారు. ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధమే లేనప్పటికీ, చూడ్డానికి ఇద్దరు హీరోల స్టిల్స్ సేమ్ టూ సేమ్ ఉండటంతో నెటిజన్లు కంపేరిజన్స్ మొదలుపెట్టారు.

'కల్కి 2898 AD' - 'దేవర 1' రెండింటిలో ఏ పోస్టర్ బాగుంది.. ఇద్దరిలో ఎవరి లుక్ బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మీ హీరో మా హీరోని ఫాలో అవుతున్నాడంటూ వాళ్ళ అభిమానులు ఫ్యాన్ వార్స్ కూడా చేసుకుంటున్నారు. నిజానికి ఇంతకముందు 'దేవర' సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కు ఇలానే వచ్చాయి. ఎన్టీఆర్ పడవ మీద వస్తున్న ఫోటోకి, 'వాల్తేరు వీరయ్య' లో చిరంజీవి పడవ మీద నిలబడ్డ పోస్టర్ కి పోలికలు పెట్టారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాతో కంపేరిజన్స్ చేస్తున్నారు.

'దేవర' అనేది కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ ఇతర పాత్రలు పోషించనున్నారు. గుజరాతీ నటి శృతి మరాఠేని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని టాక్. నందమూరి ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. 

ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD'. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిశా పతానీ స్పెషల్ రోల్ లో కనిపించనుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని 2024 మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Also Read: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్న బుచ్చిబాబు, RC16 టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola