Raashi Khanna: రాశీ ఖన్నా ఉత్తరాది అమ్మాయి. అయితే... ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ రావడానికి కారణం సౌత్ సినిమాలు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సినిమాలు. కథానాయికగా తొలి సినిమా 'మద్రాస్ కేఫ్' తర్వాత మళ్ళీ ఇప్పుడు హిందీ సినిమా 'యోధ' చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన వెబ్ సిరీస్ 'రుద్ర' విడుదలైంది. మరో వెబ్ సిరీస్ చేస్తున్నారు. 'రుద్ర' విడుదలైన సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రాశీ ఖన్నా... సౌత్ సినిమాల మీద కామెంట్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించారు.
"సౌత్ సినిమాల గురించి నేను చెడుగా మాట్లాడినట్టు కల్పించి రాసిన కంటెంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఎవరు చేసినా... దయచేసి ఆపేయమని కోరుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా, భాషపై నాకు గౌరవం ఉంటుంది" అని రాశీ ఖన్నా ట్వీట్ చేశారు.
దక్షిణాది ప్రేక్షకులకు కథానాయిక అందంగా ఉంటే చాలని, ప్రతిభ అవసరం లేదని, తెల్లగా ఉన్న హీరోయిన్లపై మిల్కీ బ్యూటీ అని ముద్ర వేస్తారని రాశీ ఖన్నా అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె వివరణతో అది అబద్ధమని తేలింది.
Also Read: KGF Chapter 2 Telugu: 'కె.జి.యఫ్ 2'లో అమ్మ పాట విన్నారా? ఎదగరా ఎదగరా, జగతికే జ్యోతిగా నిలవరా!
ఇప్పుడు రాశీ ఖన్నా చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యకు జంటగా 'థాంక్యూ' సినిమాలో కనిపించనున్నారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
Also Read: RRR Movie Success Party Photos: రాజమౌళికి త్రివిక్రమ్ షేక్ హ్యాండ్, ఎన్టీఆర్ - చరణ్ క్లాప్స్