'కె.జి.యఫ్' సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉంది. అయితే... ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. 'కె.జి.యఫ్: చాప్టర్ 1'లో రోడ్డు మీద హీరో కార్ ఆపి, ఓ తల్లితో హీరో చెప్పే మాటలు ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చాయి. 'కె.జి.యఫ్: చాప్టర్ 2' ట్రైలర్ చూస్తే... హీరోకి, ఆమె తల్లికి మధ్య సన్నివేశాలు బలంగా ఉంటాయని అర్థమవుతోంది. ఈ రోజు సినిమాలో అమ్మ పాటను విడుదల చేశారు.

'ఎదగరా... ఎదగరా... దినకరా... జగతికే జ్యోతిగా నిలవరా...పడమర నిశీధిరా... వాలనీచరితగా ఘనతగా వెలగరాఅంతులేని గమ్యము కదరాఅంతవరకూ లేదిక నిదురా'అంటూ ఈ పాట సాగింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ యష్ 'కె.జి.యఫ్: చాప్టర్ 1'కు సీక్వెల్ ఈ  'కె.జి.యఫ్: చాఫ్టర్ 2'. 'ఎదగరా... ఎదగరా...' అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. సుచేత బస్రూర్ ఈ పాటను ఆలపించడం విశేషం.

Also Read: 'గాడ్ ఫాదర్' విడుదల తేదీ కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్!?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: యూనివర్సిటీకి వెళ్తున్న రామ్ చరణ్, కియారా అడ్వాణీ! ఎక్కడంటే?