R Madhavan In SSMB29 Movie Crazy Buzz Gone Viral: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు. ఈ మూవీలో మహేష్ బాబు నటిస్తున్నారన్న ఒక్క న్యూస్ తప్ప అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు జక్కన్న. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు కూడా వాళ్లు అప్పుడప్పుడూ ఇచ్చిన ఇంటర్వ్వూల వల్ల తెలిసిందే.

ఇంట్రెస్టింగ్ అప్డేట్

పాన్ వరల్డ్ స్థాయిలో దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో భారీ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఏ చిన్న రూమర్, కానీ అప్‌డేట్ కానీ వచ్చినా అది క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ మూవీలో వారు నటిస్తున్నారు ఈ స్టార్ ఈ రోల్ అంటూ రూమర్స్ తప్ప అధికారిక ప్రకటన వచ్చింది లేదు. స్టార్ హీరో విక్రమ్ కూడా ఈ మూవీలో ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయన్ను విలన్ రోల్ కోసం సంప్రదించగా అలా చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారని సమాచారం. ఈ క్రమంలో మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

మూవీలో ఆర్.మాధవన్ 

ఇటీవలే 'కేసరి 2'లో కీలక పాత్ర పోషించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ ఆర్.మాధవన్. ఆయన ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక రోల్ ఆయన నటించనున్నారని.. షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అటు.. మహేష్ సరసన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఓ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా.. అసలు మూవీలో వారి రోల్స్ ఏంటి అనే దానిపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు జక్కన్న. 

హైప్ రెండింతలు

ఒకరు సూపర్ స్టార్.. మరొకరు మలయాళ స్టార్.. ఇంకొకరు తమిళ స్టార్.. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. ఇంత మంది స్టార్స్ ఒకే మూవీలో నటిస్తుండడంతో 'SSMB29' మూవీపై ఉన్న హైప్ పదింతలైంది. మూవీ కాన్సెప్ట్, వీరి రోల్స్ ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టేసే ఓ అడ్వెంచరస్ మ్యాన్ స్టోరీగా ఈ మూవీ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఆ అడ్వెంచర్ చూసేందుకు 2027 వరకూ ఆగాల్సిందే.

Also Read: అఖిల్ జైనాబ్‌ రిసెప్షన్‌లో 'సూపర్' స్టార్ - సిగ్నేచర్ స్టైల్ అదుర్స్.. షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా? 

ఈ మూవీని దుర్గా దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ ఒడిశాలో కంప్లీట్ చేశారు రాజమౌళి. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్స్ వేసి కీలక సీన్స్ చిత్రీకరించనున్నారనే టాక్ వినిపిస్తోంది.