Mahesh Babu's Signature Style In Akhil Zainab Wedding: అక్కినేని అఖిల్, జైనాబ్ రావ్జీల రిసెప్షన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీస్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటకు విషెష్ చెప్పారు.

మహేష్ బాబు స్పెషల్ అట్రాక్షన్

ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మహేష్ బాబు ఎప్పుడూ చాలా సింపుల్‌గా ఉంటూనే తనదైన స్టైల్‌తో అదరగొడుతుంటారు. తాజాగా ఆయన సిగ్నేచర్ స్టైల్‌లో న్యూ లుక్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన వేసుకున్న టీషర్ట్‌పైనే అందరి దృష్టీ పడింది. ఈ ఫోటోలు వైరల్ కాగానే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చనే సాగింది. 

మహేష్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ మహేష్ బాబు వేసుకున్న కలర్ స్వెట్ షర్ట్‌పై ఆరా తీశారు. ఇది హెర్మేస్ లగ్జరీ బ్రాండ్ అని.. దీని కాస్ట్ దాదాపు రూ.1.37 లక్షలని ($1600) తెలుస్తోంది. ఏ సినిమా చేసినా మహేష్ తన లుక్స్‌తో అదరగొడుతుంటారని షర్ట్ కాస్ట్ ఏముందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

స్వీట్ 16లానే ఉంటారుగా..

ప్రస్తుతం మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి 'SSMB29' మూవీలో బిజీగా ఉన్నారు. సాధారణంగా రాజమౌళి మూవీ అంటేనే దాదాపు రెండు మూడేళ్ల వేచి ఉండాల్సి ఉంటుంది. రాజమౌళి తన మూవీలో నటించే నటీనటుల లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడా ఏదీ లీక్ కాకుండా అలర్ట్ అవుతారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ కాగా.. మహేష్ బాబు లుక్స్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మూవీలో ఇలాగే కనిపించబోతున్నారంటూ చర్చ సాగింది.

ఇటీవల షూటింగ్‌కు కాస్త గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెకేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా అఖిల్ రిసెప్షన్ వేడుకలో సందడి చేయగా ఈ లుక్ కూడా అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ఆయన ఎప్పటీకీ స్వీట్ 16లానే ఉంటారని.. రోజురోజుకూ ఏజ్ తగ్గుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: బరువు తగ్గిన పవన్ కళ్యాణ్.. ఓజీ కోసం ఫిట్​గా మారి ట్రోల్స్​కి చెక్​ పెట్టేశాడుగా, పవర్ స్టార్ ఫిట్​నెస్ రొటీన్ ఇదే

షూటింగ్ ప్రారంభం

ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఒడిశాలోని సిమిలిగూడ సమీపంలో మాలి, పుట్ సీల్, బాల్డ ప్రాంతాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీని కోసం ఓ భారీ సెట్ వేశారనే టాక్ వినిపిస్తోంది. కీలక సీన్స్ చిత్రీకరించనున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో మూవీ తెరకెక్కనుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2027 నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.