Pushpa 2 The Rule Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప 1' చిత్రం ఎవరూ ఊహించని విజయం సాధించడంతో.. ఇప్పుడు రెండో భాగం చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ తో వస్తున్నారు. 


పుష్ప మాస్ జాతర...‘పుష్ప 2’ అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటంతో.. తప్పకుండా అప్డేట్ వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఎలాంటి కంటెంట్ బయటకు వస్తుందని అంతా చర్చించుకుంటున్న సమయంలో.. "రేపు పుష్ప మాస్ జాతర ప్రారంభం కానుంది" అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 2న ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ లోడింగ్ అవుతోంది.. వేచి ఉండండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.






'పుష్ప: ది రూల్' నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను రెట్టింపు చేసింది. వచ్చే వారం బన్నీ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఫస్ట్ సింగిల్ విడుదల చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వీటిల్లో ఏ కంటెంట్ బయటకు వస్తుందో తెలియదు కానీ, దీంతో పుష్ప మాస్ జాతర మొదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఏదేమైనా ఈసారి బన్నీ పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారబోతోందని అర్థమవుతోంది.


'పుష్ప 2' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 


'పుష్ప: ది రూల్' చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా 2024 ఆగష్టు 15న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'పుష్ప: ది రైజ్' మూవీ అల్లు అర్జున్ కు నేషనల్ ఫిలిం అవార్డ్ తెచ్చిపెట్టడమే కాదు, ఆయన్ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం పెట్టేంత గుర్తింపు వచ్చేలా చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


Also Read: ఎన్టీఆర్ నుంచి నిఖిల్ సిద్దార్థ వరకు - పాలిటిక్స్‌లో మన టాలీవుడ్ స్టార్స్, హిట్ కొట్టింది కొందరే!