Do you know the teasers in the Telugu film industry that received the fastest 100k likes: పుష్ప... పుష్ప రాజ్ పాత్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన అందరికీ నచ్చింది. ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అందువల్ల, 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ 'పుష్ప: ది రూల్' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువ ఉన్నాయి. బన్నీ బర్త్ డే సందర్భంగా ఇవాళ 'పుష్ప 2' టీజర్ (Pushpa 2 Teaser) విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఓ రికార్డు వేటలో మాత్రం 'పుష్ప 2' మూడు నిమిషాల దూరంలో ఆగింది.


ఆ లిస్టులో 'ఆర్ఆర్ఆర్' టాప్...
ఆ వెనుక ప్రభాస్ & పవన్ కళ్యాణ్!
లైక్స్... యూట్యూబ్‌లో వీడియో గ్లింప్స్ లేదా టీజర్ లేదా ట్రైలర్ విడుదల అయిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు ముందుగా చెక్ చేసేది ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఎన్ని లైక్స్ వచ్చాయి? అని! 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి? అనేది చూసి, ఆ లెక్కల ఆధారంగా ఆయా హీరోల స్టార్‌డమ్ / ఫ్యాన్ ఫాలోయింగ్ లెక్క కడుతున్న రోజులు ఇవి.


Also Read: జనసేన పార్టీకి చిరంజీవి 'మెగా' విరాళం - 'విశ్వంభర' సెట్స్‌లో అన్నయ్యను కలిసిన తమ్ముడు


ఇప్పుడు 'పుష్ప 2' టీజర్ విడుదలైన వెంటనే 100k లైక్స్ (లక్ష లైకులు) ఎన్ని నిమిషాల్లో వచ్చాయి అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మూడు నిమిషాల దూరంలో రికార్డు చేజారింది. 'పుష్ప 2' టీజర్ (Pushpa 2 Teaser Records)కు లక్ష లైకులు రావడానికి తొమ్మిది నిమిషాలు పట్టింది. అయితే... తక్కువ సమమంలో (101 నిమిషాల్లో) 550k లైక్స్ (ఐదు లక్షల లైకులు) పొందిన టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. 


RRR teaser remains top in fastest 100k likes record: తక్కువ సమయంలో లక్ష లైకులు పొందిన రికార్డు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా పేరిట ఉంది. కేవలం ఆరు నిమిషాల్లో ఆ టీజర్ 100k లైక్స్ పొందింది. రెండో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమా టీజర్లు ఉన్నారు. ఆ రెండూ 8 నిమిషాల్లో ఆ రికార్డు చేరుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ అయితే 18 నిమిషాల్లో 100k లైక్స్ ఫీట్ చేరుకుంది.


Also Read'పుష్పరాజ్'కు ముందు అల్లు అర్జున్ టాప్ ఫైవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లు - ఈ సినిమాలే ఎందుకంత స్పెషలో తెలుసుకోండి



Pushpa 2 Teaser Views In 24 Hours: యూట్యూబ్ వ్యూస్ పరంగా 'పుష్ప 2' టీజర్ ఏమైనా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఆల్రెడీ 11 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరి, 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వస్తాయో? వెయిట్ అండ్ సి. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 15న పాన్ వరల్డ్ రిలీజ్ కానుంది. 


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?