మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాల మీద ఉందని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే, మెగా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. చిరు చిన్న తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఏపీ అసెంబ్లీ పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఆయన స్థాపించిన జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. తెలుగు దేశం, బీజేపీ పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలకు ముందు అన్నయ్యను తమ్ముడు కలిశారు. 


జనసేన పార్టీకి చిరంజీవి 'మెగా' విరాళం!
Pawan Kalyan met Chiranjeevi at Vishwambhara sets: ఇప్పుడు సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ 'విశ్వంభర' సినిమా చిత్రీకరణలో ఉన్నారు చిరంజీవి. పోచంపల్లికి సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు. అన్నయ్యను కలవడానికి అక్కడికి వెళ్లారు తమ్ముడు పవన్ కల్యాణ్. మెగా బ్రదర్స్ ఇద్దరూ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. అనంతరం జనసేన పార్టీకి చిరంజీవి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


Also Read'పుష్పరాజ్'కు ముందు అల్లు అర్జున్ టాప్ ఫైవ్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లు - ఈ సినిమాలే ఎందుకంత స్పెషలో తెలుసుకోండి


జనసేన పార్టీకి వీలైనంత తక్కువగా పవన్ కల్యాణ్ విరాళాలు స్వీకరిస్తున్నారు. తన స్వార్జితం నుంచి ఇటీవల రూ. 10 కోట్లు పార్టీ నిర్వహణ ఖర్చులకు ఇచ్చారు. మెగా హీరోలు తమ శక్తి మేరకు జనసేనకు విరాళాలు ఇస్తున్నారు. ఆ మధ్య జనసేన కౌలు రైతు సంక్షేమ నిధికి మెగా మదర్ అంజనా దేవి లక్షన్నర విరాళం ఇచ్చారు. ఆ మధ్య నాగబాబు తనయుడు, యువ హీరో వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ రూ. 10 లక్షలు, వైష్ణవ్ తేజ్, నిహారికా కొణిదెల చెరో 5 లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. 'ఆరెంజ్' రీ రిలీజ్ కలెక్షన్లు సైతం జనసేనకు విరాళంగా ఇచ్చారు.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?



జనసేనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ!
అన్నదమ్ములు పవన్ కల్యాణ్, నాగబాబు... మెగా కుటుంబం నుంచి వాళ్లిద్దరూ మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. మిగతా వారు జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నది లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలను జనసేన పార్టీకి వీలైనంత దూరంగా ఉండమని, సినిమాలపై దృష్టి పెట్టమని పవన్ కల్యాణ్ సూచించినట్టు సమాచారం అందుతోంది. ఒకవేళ పవన్ పిలిస్తే... ప్రచారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మెగా ఫ్యామిలీలో యంగ్ స్టార్స్ పలు వేదికల్లో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతు జనసేనకు ఉంటుందని, ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా పవన్ వెంట ఫ్యామిలీ నడవడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.


Also Readనాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!