ఇండియన్ సినిమా హిస్టరీలో ఇండియాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా తమదేనని 'పుష్ప 2: ది రూల్' చిత్ర బృందం సగర్వంగా ప్రకటించుకుంది. తమ సినిమా 1831 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని అనౌన్స్ చేసింది. తమది ఇండస్ట్రీ హిట్ అని చెప్పింది. ఈ సినిమాకు అదనపు హంగులు జోడించడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. సుమారు 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలు యాడ్ చేయనున్నట్లు చెప్పింది. ఆ విషయంలో కాస్త ఆలస్యం జరుగుతోంది.


సంక్రాంతి తర్వాతే కొత్త సీన్లు...
ఆలస్యానికి కారణం ఏమిటంటే?
తొలుత జనవరి 11వ తేదీ నుంచి పుష్ప 2 రీ లోడెడ్‌ వెర్షన్ అన్ని థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది. దాంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సంక్రాంతి కానుక సిద్ధమైందని అనుకున్నారంతా! అయితే... జనవరి 11న రీ లోడెడ్ వెర్షన్ రావడం లేదు. ఆరు రోజులు ఆలస్యం అవుతోంది.


జనవరి 17వ తేదీ నుంచి కొత్త సన్నివేశాలతో కూడిన 'పుష్ప 2 ది రూల్'ను థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. టెక్నికల్ పరమైన కారణాల వల్ల కంటెంట్ ప్రాసెసింగ్ చేయడం ఆలస్యం అయినట్లు చిత్ర బృందం వివరించింది.


Also Read: నేనూ హిందువువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి






సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ తప్పినట్టే!
సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. 'పుష్ప 2'కు సీన్లు యాడ్ చేయడం వల్ల ఆ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని కొందరు, కొత్త సినిమాలు ఉన్నప్పుడు 'పుష్ప 2'కు సీన్లు యాడ్ చేసినా సరే ఎవరు చూస్తారని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఇప్పుడు ఓ సినిమా నుంచి మరో సినిమాకు ఎఫెక్ట్ పడదు. 


Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?