ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప 2'. థియేటర్లలో ఇంకా రఫ్పాడిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటిదాకా ఏ మాత్రం జోష్ తగ్గకుండా థియేటర్లలో అదరగొడుతుంది 'పుష్ప 2'. ఇక మరో వారం రోజుల్లో కొత్త సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. కాబట్టి పుష్ప రాజ్ జోరు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పు'ష్ప 2' మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఓటీటీ మూవీ లవర్స్. 


పుష్ప రాజ్ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడంటే? 
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప 2'. భారీ అంచనాలతో డిసెంబర్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా కలెక్షన్ల జాతర చూపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 1500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి, పలు రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం నెలకొన్న వివాదాస్పద పరిస్థితులు ఈ మూవీ కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. అయితే ఇప్పటికే 'పుష్ప 2' మూవీ వచ్చి రెండు వారాలు పూర్తి కావడంతో ఈ మూవీని ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. 


'పుష్ప 2' మూవీ డిజిటల్ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ రికార్డ్ బ్రేకింగ్ ధరకు సొంతం చేసుకుంది. ఇదివరకు ఎన్నడూ ఒక తెలుగు సినిమాకు ఇంతటి ఓటీటీ డీల్ కుదరలేదనే చెప్పాలి. అయితే భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం 40 రోజుల విండో డీల్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా 40 రోజులు ఆడిన తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే 'పుష్ప 2' మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం 'పుష్ప 2' మూవీని 2025 జనవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. 


Also Read: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు



థియేటర్లలో 'గేమ్ ఛేంజర్', ఓటీటీలో పుష్ప రాజ్ 
నిజంగానే 'పుష్ప 2' మూవీ జనవరి 9న ఓటీటీలోకి అడుగుపెడితే 'పుష్ప 2' వర్సెస్ 'గేమ్ ఛేంజర్' అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఆ తర్వాత రోజే 'గేమ్ ఛేంజర్' మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. అంటే ఒక రోజు ముందే ప్రీమియర్స్ ఉంటాయి. కాబట్టి కరెక్ట్ గా థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ అయ్యే సమయానికి ఓటీటీలో 'పుష్ప 2' మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. మరి థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.



Read Also : Oscars 2025: ఆస్కార్ 2025 రేసులో ఇండియన్ సినిమా అవుట్... టాప్ 10లో 'లాపతా లేడీస్' లేదు