Manamey OTT Release: బాక్సాఫీస్ దగ్గర అంతగా సత్తా చాటని సినిమాలో ఓటీటీలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు వెనుకాడుతున్నాయి. అలాంటి సినిమాల్లో ‘మనమే‘ ఒకటి. శర్వానంద్, కృతిశెట్టి ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనా, కలెక్షన్ల పరంగా సత్తా చాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కు రాలేకపోతోంది.
జూన్ 7న థియేటర్లలో ‘మనమే’ విడుదల
‘మనమే’ సినిమా జూన్ 7న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. వసూళ్లు కూడా అనుకున్న స్థాయిలో రాలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘మనమే’ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇదుగో వచ్చే.. అదుగో వచ్చే.. అంటూ ప్రచారం జరుగుతుంది తప్ప, స్ట్రీమింగ్ కావడం లేదు.
నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మోసపోయాం- నిర్మాత విశ్వప్రసాద్
‘మనమే’ సినిమా ఓటీటీలో ఎందుకు విడుదల కావడం లేదు అనే విషయంపై తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాదం స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘ మనమే’ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మోసపోయినట్లు తెలిపారు. ఓ సంస్థకు ‘మనమే’ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇచ్చామని చెప్పారు. అయితే, ఆ సంస్థ పలు కారణాలు చెప్తూ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ కు సినిమా రైట్స్ ను అమ్మలేదని చెప్పారు. తమకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో ఇంకా ‘మనమే’ సినిమా విడుదల కావడంలేదన్నారు. మరోవైపు నాన్ థ్రియేట్రికల్ రైట్స్ తీసుకున్న వ్యక్తులు తమకు డబ్బులు చెల్లించలేదని కోర్టులో కేసు కూడా వేసినట్లు చెప్పారు. నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్న వ్యక్తులు, ఇతర సినిమాలను ఓటీటీలకు ఇస్తూ, ‘మనమే’ సినిమాను మాత్రం ఇవ్వడం లేదన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు ప్రచారం
‘మనమే’ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కొనుగోలు చేసినట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే, అసలు ఓటీటీ రైట్స్ అమ్మకమే జరగలేని విశ్వప్రసాద్ తెలిపారు. దీంతో అసలు ‘మనమే’ సినిమా ఓటీటీలో వస్తుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వివాదం తేలే వరకు సినిమా ఓటీటీలో విడుదల కానట్లే అని అర్థం అవుతోంది. శ్రీరామ్ ఆదిత్య ‘మనమే’ సినిమాకు దర్శకత్వం వహించారు. శర్వానంద్, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
Read Also: హీరో నితిన్ హోం బ్యానర్‌కి శివకార్తికేయన్ పాన్ ఇండియా మూవీ - భారీ ఢీల్‌కు అమరన్ తెలుగు రైట్స్
Read Also: ఎన్ కన్వెన్షన్ మీద దెబ్బ నాగార్జునకా ? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకా?