టాలీవుడ్‌లో ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ స్రవంతి మూవీస్ అధినేత 'స్రవంతి'' రవి కిషోర్ తాజాగా 'దీపావళి' అనే సినిమాను నిర్మించారు. రవి కిషోర్ తొలితమిళ సినిమా 'కిడా' కి ఇది తెలుగు అనువాదం. ఈనెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మీడియాతో ముచ్చటించారు. 'మీ సినీ ప్రయాణంలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటి?'అని అడగ్గా..


" డైరెక్టర్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏం తీయబోతున్నాడో నాకు ముందే తెలియలని కోరుకుంటా. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత సెట్స్ మీ ఇంటికి వెళ్తాం. ఐదారు నెలల నుంచి ఒక స్క్రిప్ట్ వరకు జరుగుతుంది. మరో మూడు నెలలు పట్టొచ్చు. ఒక స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు మరో స్క్రిప్ట్ గురించి ఆలోచించను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే" అని చెప్పారు. 'కిడా' కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు బదులిస్తూ.."నేను చెన్నైలో కథలు వింటున్న. నా ఫ్రెండ్ ఒకరు ఓ కథ విన్నాను. మీరు వినండి అని పది నిమిషాలు చెప్పాడు. నాకు కథ నచ్చి వెంటనే డైరెక్టర్ ఆర్ ఏ వెంకట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశా. వేరే నిర్మాతతో చేద్దామని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒకవేళ మార్పులు ఏమైనా ఉంటే చెప్పమని అడిగితే 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. అప్పుడు స్క్రిప్ట్ అంతా రికార్డ్ చేసి పంపించమని అడిగాను. బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ చేసి పంపడంతో అది విని ఓకే చేశాను" అని చెప్పారు.


'రిలీజ్ కి ముందే 'దీపావళి'కి అవార్డులు వచ్చాయి. దీనిపై మీ ఫీలింగ్ ఏంటి?' అని అడిగితే.. "నేను కథ నమ్మి సినిమా నిర్మించా. నాకు లాభం ఎంత వస్తుంది అని ఆలోచించకుండా మంచి సినిమా అవుతుందని నమ్మాను. సినిమా చూసిన కొందరు ఫ్రెండ్స్ ఫిలిం ఫెస్టివల్స్ లేదా అవార్డులకు ఎందుకు పంపించకూడదని అడిగారు. స్నేహితుల మాటలతో ఇండియా మనోరమకు పంపించా. ఒకరోజు సినిమా సెలెక్ట్ అయిందని ఫోన్ వచ్చింది. అది ఒక గొప్ప అనుభూతి. అందరి మనసుని హద్దుకునే చిత్రమిది" అని అన్నారు. ప్రీమియర్స్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. "తెలుగులో దిల్ రాజుతో పాటూ మీడియా కూడా ఈ సినిమా చూసింది. బాగుందని అందరూ ప్రశంసించారు. చెన్నైలో సుమారు 200 మంది మీడియా మిత్రులకు ఓ షో వేశాం. సినిమా చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంతకుముందు గోవాలో కూడా అలాంటి స్పందనే వచ్చింది" అని అన్నారు.


దీపావళికి పెద్ద సినిమాలు విడుదల మధ్య మీ తమ సినిమా విడుదల చేయడంపై మాట్లాడుతూ.. "దీపావళి పండక్కి బాణా సంచాలు, వెలుగులు ఎంత ముఖ్యమో పిండి వంటలు, కొత్త దుస్తులు కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా కూడా అంతే. ఇప్పుడు ఆడియన్స్ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా దీపావళిని కూడా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను" అని అన్నారు. 'మీ ఇంట్లో స్టార్ హీరో ఉన్నారు. మీరు అడిగితే పెద్ద హీరోలు కూడా సినిమాలు చేస్తారు. కానీ మీరు చిన్న సినిమా చేయడానికి కారణం ఏంటి?' అని అడిగితే.. "రామ్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది" అని అన్నారు.


"నేను చేసిన సినిమాలు కంటే చేయకుండా ఆపేసిన స్క్రిప్ట్స్ ఎక్కువ. రామ్ వరకు వెళ్లకుండా చాలా కథలు పక్కన పెట్టేసాం. కథపై నాకు సంతృప్తి కలిగినప్పుడు రామ్ తో సినిమా చేస్తా" అని చెప్పుకొచ్చారు. మీరు త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు? రామ్ హీరోగా సినిమా చేస్తారా? అనే ప్రశ్నలకు బదులిస్తూ.. "త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా చేయాలని నాకు కూడా ఉంది. ముందు తన కమిట్మెంట్స్ ఏమున్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి. రామ్ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుందని అతను అనుకోవాలి" అని అన్నారు.


Also Read : ఓటీటీలో వరుణ్, లావణ్య పెళ్లి వీడియో - అసలు విషయాన్ని బయటపెట్టిన వరుణ్ తేజ్ టీమ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial