Bandla Ganesh Comments On Allu Aravind In Little Hearts Success Meet: వేదిక, వేడుక ఏదైనా తనదైన స్పీచ్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. తాజాగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్‌లో ఆయన పాల్గొని నిర్మాత అల్లు అరవింద్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ట్రోలింగ్ సాగుతుండగా బండ్ల గణేష్ మరో పోస్ట్ పెట్టారు.
ఆ అదృష్టం అందరికీ రాదు
సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నింటికీ ప్రిపేర్ అయ్యి రావాలని అన్నారు బండ్ల గణేష్. 'ఎవరో కొన్ని వందల కోట్లకు ఒకాయన ఉంటారు. ఓ స్టార్ కమెడియన్ కొడుకుగా పుడతారు. ఓ మెగాస్టార్‌కు బావమరిదిగా ఉంటారు. ఒక ఐకాన్ స్టార్‌కు తండ్రిగా ఉంటారు. అట్లా వంద కోట్లకు ఒకరే ఉంటారు. అందరూ అలా ఉండలేరు. మనమంతా కష్టపడాల్సిందే. ఎప్పుడూ కాలు మీదు కాలేసుకునే ఉంటారు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరు.
ఆయన ఎవరనుకుంటే వారే ఆయనకు అందుబాటులోకి వెళ్తారు. అదీ జీవితం అంటే. అంతటి మహర్జాతకుడిని నా జీవితంలో చూడలేదు. ఇక చూడను కూడా. అరవింద్ గారు లాస్ట్ మినిట్‌లో వస్తారు. ఓకే అంటారు. పేరు కొట్టేస్తారు. ఆయన అదృష్టం అది. మీ షర్ట్ నలగదు. మీ మనసు నలగదు. మీ హెయిర్ స్టైల్ మారదు. కానీ డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం. దానికి ఎవరూ ఏమీ చేయలేరు.' అంటూ నవ్వులు పూయించారు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ సాగగా... గణేష్ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు.
అల్లు అరవింద్ గొప్ప నిర్మాత
అల్లు అరవిద్ గొప్ప నిర్మాత అని... ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పోస్ట్ చేశారు బండ్ల గణేష్. 'ఆయన నిర్మించే మూవీస్ ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ టాలీవుడ్‌కే గర్వకారణం. అల్లు అరవింద్ గారంటే నాకు చాలా ఇష్టం.' అంటూ రాసుకొచ్చారు.
Also Read: 'కల్కి 2898AD' నుంచి దీపికా అవుట్ - డైరెక్టర్ నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్... కృష్ణుడి డైలాగ్‌తో...
కిక్ ఇచ్చిన మూవీ 'లిటిల్ హార్ట్స్'
చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి కిక్ ఇచ్చిన మూవీ 'లిటిల్ హార్ట్స్' అని చెప్పారు బండ్ల గణేష్. 'చిన్న సినిమా చచ్చిపోయింది. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దామనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో సినిమా హిట్ అవుతుందని నిరూపించిన మూవీ లిటిల్ హార్ట్స్. రూ.25 కోట్లతోనే రూ.50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్సాఫ్ టు లిటిల్ హార్ట్స్ టీం. మిమ్మల్ని చూసి పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు నాతో పాటు సిగ్గుతో తలొంచుకోవాల్సిన రోజు తెచ్చారు. లిటిల్ హార్ట్స్ సినిమా చూస్తే మా నాన్నకు నాకు జరిగిన స్టోరీ అనిపించింది. ఇలాంటి సినిమాలు ఏడాదికి 12 వస్తే ఇండస్ట్రీ వందేళ్లు చల్లగా ఉంటుంది.' అని చెప్పారు.
పవన్ 'ఓజీ' హిట్ అంతే...
ఈ సందర్భంగా పవన్ వీరాభిమానిగా 'ఓజీ' మూవీ గురించి మాట్లాడారు బండ్ల గణేష్. 'దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది అభిమానుల్లో నేనూ ఓ అభిమానిని. తిరుపతి దేవుడికి రోజూ లక్ష మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. వారిలో నేనూ ఒకడినే. మీలాగే నేనూ పూజిస్తాను, ప్రేమిస్తాను. నేనూ మీలో ఒకడినే. 'ఓజీ' బ్లాక్ బస్టర్ అవ్వాలని మీతో పాటే నేను కూడా కోరుకుంటున్నా. అది తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.' అని చెప్పారు.