టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ప్రస్తుతం పెద్దదిక్కుగా కొనసాగుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు. చిన్నప్పటి నుంచి కృష్ణ వెంటే ఉంటూ తన అన్నయ్య ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. అలా కృష్ణతో చాలా సినిమాలు స్వయంగా నిర్మించారు ఆదిశేషగిరిరావు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఆయన నిర్మించిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా రీ రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సీనియర్ నటుడు, కృష్ణ రెండో భార్య విజయనిర్మల కొడుకు నరేష్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో నరేష్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తాజా ఇంటర్వ్యూలో ఆదిశేషగిరిరావుని యాంకర్ ఓ ప్రశ్న వేసింది. ఇండస్ట్రీలో డీసెంట్, డిసిప్లీనరి ఫ్యామిలీగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ అని చెప్పకుంటారు. అలాంటిది ఆయన మరణం తర్వాత ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో ఇష్యూస్ బయటికి వచ్చాయి. వాటికి ఓ ఫ్యామిలీ పెద్దగా మీరు ఏం రియాక్ట్ అవ్వట్లేదా? అని అడిగితే.. అలాంటిదేమి లేదని ఆయన అన్నారు. నరేష్ వ్యవహారంలో మీరు ఏం ఇన్వాల్వ్ అవ్వరా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నేను వాళ్ళ వ్యవహారంలో అసలే ఇన్వాల్వ్ కాను అని అన్నారు.
నరేష్ భార్య రమ్య ఇటీవల కృష్ణ చివరి రోజుల్లో ఆయనను ఒంటరిగా వదిలేశారని, కృష్ణను అనాథలా ఇంట్లోనే వదిలేశారంటూ చేసిన ఆరోపణలపై ఆదిశేషగిరిరావు బదులిస్తూ.. ‘‘అదంతా అబద్ధం. ఎవరు లేకపోవడం ఏంటి? ఆరోజు రాత్రి మొత్తం మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. అతనితోపాటు మా మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే మహేష్ బాబు లేకపోతే ఎవరూ లేనట్టేనా దాని అర్థం అని అన్నారు. అయితే, ఆమె మహేష్ బాబును అనలేదని, నరేష్‌ను అన్నారని యాంకర్ చెప్పడంతో.. ఆయన ఘాటుగా బదులిచ్చారు.
‘‘అసలు నరేష్ ఎవరు? నరేష్ ఎవరో తెలియదు. ఆరోజు రాత్రి అన్నయ్య దగ్గర మా అబ్బాయి ఉన్నాడు. మా మేనల్లుడు కూడా ఉన్నాడు. అసలు ఆ నరేష్, వాళ్ళ ఇష్యూస్ నేను మాట్లాడను. అసలే ఇన్వాల్వ్ కాను" అంటూ నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదిశేషగిరిరావు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆదిశేషగిరిరావు నిర్మాణంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఎవర్ గ్రీన్ హిట్ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా ఆయన జయంతి సందర్భంగా మే 31న థియేటర్స్ లో 4k Ultra HD క్వాలిటీ లో రీ రిలీజ్ అవుతోంది. ఇండియాలోనే మొదటి కౌబాయ్ మూవీగా రూపొందిన ఈ సినిమా 1971లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. సుమారు 52 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: మహేష్ బాబు మిమిక్రీ చేస్తాడు, 14 ఏళ్ల వయస్సులో పోలీసులకు దొరికిపోయాడు: ఆదిశేషగిరి రావు