కన్నడ కథానాయకుడు, దర్శకుడు ఉపేంద్ర (Upendra)కు తెలుగు ప్రేక్షకుల్లోనూ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. ఈవీవీ 'కన్యాదానం'లో ఆయన ఓ హీరోగా నటించారు. అంతకు ముందు రాజశేఖర్ హీరోగా 'ఓంకారం' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'ఏ', 'రా' చిత్రాలు ఏ స్థాయిలో విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 


ఉపేంద్ర భార్య, కథానాయిక ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) సైతం మన ప్రేక్షకులకు తెలుసు. తెలుగులో జేడీ చక్రవర్తి 'సూరి', ఉపేంద్ర 'రా' సినిమాల్లో ఆమె నటించారు. నటిగా ఆవిడ 50 చిత్రాల మైలురాయి చేరుకున్నారు. ప్రియాంకా ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా 'డిటెక్టివ్ తీక్షణ'.  


సెప్టెంబర్ 15న 'డిటెక్టివ్ తీక్షణ' ట్రైలర్!
కథానాయికగా, నటిగా ప్రియాంకా ఉపేంద్ర 50వ సినిమా 'డిటెక్టివ్ తీక్షణ'. త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తున్నారు. సూట్ వేసుకుని, గన్ పట్టుకుని స్టైలిష్ & ఇంటెన్స్ లుక్‌లో ప్రియాంక కనిపిస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రోమోలు ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. 


Also Read : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?



ఏడు భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ' విడుదల!
తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ' సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిర్మాతలు గుత్తముని ప్రసన్న ( పొలకల చిత్తూర్, ఆంధ్ర ప్రదేశ్), జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్) పురుషోత్తం బి (ఎస్.డి.సి) తెలిపారు. ట్రైలర్ సైతం ఏడు భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా 'డిటెక్టివ్ తీక్షణ' అవుతుందని తెలిపారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామన్నారు.  


Also Read  మహాశివునిగా ప్రభాస్ - ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!  



'డిటెక్టివ్ తీక్షణ'ను ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాగా కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాగా చూడాలని ప్రియాంకా ఉపేంద్ర చెబుతున్నారు. తనతో పాటు సినిమాలో చాలా ప్రధాన పాత్రలు ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిల్ ఇస్తుందని చెప్పారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు చేయడం ఎంజాయ్ చేశానన్నారు. తొలిసారి కథ విన్నప్పుడు తనకు 'బ్యోమకేష్ బక్షి', 'నాన్సీ డ్రూ' వంటి చిత్రాలు గుర్తు వచ్చాయన్నారు. ఇదొక స్ట్రాంగ్, ఇంటెలిజెంట్, బ్రేవ్ విమన్ కథ అని, దర్శకుడు రఘు చాలా బాగా తెరకెక్కించారని చెప్పారు. 


ఉపేంద్ర ప్రశంసలు అందుకున్న 'డిటెక్టివ్ తీక్షణ''డిటెక్టివ్ తీక్షణ' రషెస్ తన భర్త ఉపేంద్ర చూశారని ప్రియాంక తెలిపారు. ఉపేంద్ర ఏమన్నారు? అనేదాని గురించి ప్రియాంక మాట్లాడుతూ ''ఆయన రషెస్ చూసి చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయారు. 'ఇది రా ఫుటేజ్ లా లేదు. పూర్తి డిఐ వర్క్ కంప్లీట్ చేశాక వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో... అంత క్వాలిటీతో ఉంది' అని ఆయన ఆశ్చర్యపోయారు. 'డిటెక్టివ్ తీక్షణ' ప్రారంభోత్సవానికి కూడా ఆయన వచ్చారు'' అని చెప్పారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial