Salaar Child Artist Karthikeya Interview : ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల భారీ వసూళ్లను అందుకుంటోంది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.178 కోట్ల గ్రాస్​ని అందుకొని 2023లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ మూవీతో ప్రభాస్ భారీ కం బ్యాక్ అందుకున్నారు.


బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో డీలా పడ్డ ప్రభాస్​కి సలార్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇన్నాళ్లకు ప్రభాస్ కటౌట్ కు తగ్గ సినిమా పడిందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా అంతటా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ చిత్రానికి ఎలాంటి ప్రమోషన్ ప్లాన్ చేయలేదు మూవీ టీం. అటు మీడియాతోను ఇంటరాక్ట్ అయింది లేదు. కానీ ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశారు. కాగా ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.


అయితే ఈ సినిమాలో ప్రభాస్, పృధ్విరాజ్ చిన్ననాటి పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్స్ మంచి నటనను కనబరిచి ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. తాజాగా సలార్​లో పృధ్విరాజ్ చిన్ననాటి పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో సలార్ తో పాటు తనకు మరో సినిమాలోనూ ఛాన్స్ వచ్చిందని చెప్పాడు.


" ప్రస్తుతం నేను పదో తరగతి చదువుకుంటున్నాను. మా సొంతూరు ప్రకాశం జిల్లా. కొన్నాళ్ల క్రితమే హైదరాబాదులో సెటిల్ అయ్యాము. ఓ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా నాకు సలార్ ఆడిషన్స్​కు వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఆ ఆడిషన్స్​కు చాలా మంది వచ్చారు. అయితే నా యాక్టింగ్ నచ్చి ప్రశాంత్ నీల్ ఇందులో ఛాన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు సలార్​లో నా యాక్టింగ్ చూసి పృధ్విరాజ్ తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ కూడా ఇచ్చారు. లూసిఫర్ సీక్వెల్​లో పృధ్విరాజ్ చిన్నప్పటి పాత్రకు నన్ను సెలెక్ట్ చేశారు" అని చెప్పుకొచ్చాడు కార్తికేయ. దీంతో సలార్ చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక సలార్ విషయానికొస్తే.. కేజిఎఫ్ సినిమాని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు.


Also Read :‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్ లాక్, అసలు విషయం చెప్పేసిన దిల్‌ రాజు