Mohan Babu About Kannappa Movie: మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తొలి షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు.   మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ న్యూజీలాండ్ లో కంప్లీట్ చేశారు. అక్కడ దాదాపు మూడు నెలల పాటు షూటింగ్ జరిగింది.  ఫస్ట్ షెడ్యూల్ లో థాయిలాండ్ కు చెందిన టెక్నికల్ టీమ్ భాగమయ్యింది. మొత్తం 600 మంది హాలీవుడ్ హాలీవుడ్ ప్రముఖులు పని చేశారు. న్యూజీలాండ్ లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేశారు. రెండో షెడ్యూల్ కోసం ఇండియాకు వస్తున్నట్లు మంచు మోహన్ బాబు తెలిపారు.


‘కన్నప్ప’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్


‘కన్నప్ప’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూట్ కు సంబంధించి ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మూవీ లొకేషన్ లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ పలు విషయాలు తెలిపారు.‘న్యూజిలాండ్ లో ‘కన్నప్ప’ మూవీ తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇందులో 600 మంది హాలీవుడ్ నిపుణులు భాగం అయ్యారు. భారత్ కు చెందిన అతిరథ మహారథులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థాయిలాండ్, న్యూజిలాండ్ కు చెందిన సాంకేతిక నిపుణులు సహకారం అందించారు. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో జరిగింది. ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. న్యూజీలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని భారత్ కు తిరిగి వస్తున్నాం” అని తెలిపారు.






కీలక పాత్రలు పోషిస్తున్న దిగ్గజ నటీనటులు


‘కన్నప్ప’ సినిమా ‘మహాభారత’ సిరీస్‌ ను రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మంచు విష్ణు ఈ చిత్రంలో భక్త కన్నప్పగా కనిపించనున్నారు.  మోడల్ ప్రీతి ముకుందన్‌ ఈ మూవీతో హీరోగా తెరంగేట్రం చేయబోతోంది.  శివ పార్వతులుగా ప్రభాస్‌, నయనతార నటించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరోలు శివరాజ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి  రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటోంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దాదాపు 80 శాతం వరకు న్యూజిలాండ్‌‌‌లోనే కంప్లీట్ చేశారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద విష్ణు మోహన్ బాబు నిర్మిస్తున్నారు.  






Read Also: ‘సలార్’ మూవీలో దుమ్మురేపిన విశాల్ వదిన, శ్రియా నటనకు ప్రేక్షకులు ఫిదా అంతే!