Aadujeevitham aka The Goat Life Release: ఎట్టకేలకు స్టార్‌ హీరో సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. 6 ఏళ్ల క్రితమే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని అడ్డుంకులను ఎదుర్కొన్ని థియేటర్లోకి రాబోతోంది. అదే మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడు జీవితం' చిత్రం. ఇంగ్లీష్‌లో 'ది గోట్‌ లైఫ్‌'తో రిలీజ్‌ అవుతుంది. దాదాపు అన్ని భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా 16 ఏళ్ల క్రితమే మొదలైంది. అప్పటి నుంచి ఆర్థిక కష్టాలను ఈదుతూ ఈ ఏడాది 2024లో విడుదలకు నోచుకుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్‌ డేట్‌ను తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. మార్చి 28న వరల్డ్‌ వైడ్‌గా 'ఆడు జీవితం'(ది గోట్‌ లైఫ్‌) మూవీ రిలీజ్‌ కాబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆసక్తి పెంచింది. 16 ఏళ్ల క్రితమే కాన్సెప్షన్‌.. పదేళ్ల స్క్రిప్ట్‌ వర్క్‌.. ఆరేళ్లుగా జరుపుకున్న షూటింగ్‌కు.. ఇక వెయిటింగ్‌కు ఇంక దగ్గర్లోనే ఉంది" అంటూ ఆడు జీవితం మార్చి 28న వరల్డ్‌ వైడ్‌గా విడుదలకు రెడీ అయ్యిందని పేర్కొంది.   


నిజ జీవిత సంఘటన ఆధారంగా 'ఆడు జీవితం'


ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బ్లెస్సీ పదిహేనేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ ఏడాది కాన్ చలన చిత్రోత్సవాల్లో సినిమా ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. 1990లో జీవనోపాధి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి జీవిత కథగా ఆధారంంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఏడాది దేశంకు వలస వెళ్లిన అతడు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, అతడికి ఎదురైన సమస్యల చూట్టూ ఈ మూవీ సాగనుంది. పాస్ పోర్టులు లాక్కోవటం... బానిసలుగా మార్చుకోవటం... ఇమ్మిగ్రేషన్ కష్టాలు... ఎడారిలో బానిస బతుకు.... ఇలా ఓ వలస వ్యక్తి కష్టాలను మొత్తం ఈ సినిమాతో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.






ఇక రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్‌ గతేడాది విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ చూసి ప్రతి ఒక్కరు షాకయ్యారు. వలస కూలీగా, బానిస వ్యక్తిగా పృథ్వీరాజ్ మేకోవర్‌ అయిన తీరు ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్‌ చేసింది. ట్రైలర్లో ఆయన చూసి గుర్తు పట్టడం చాలా కష్టమనే చెప్పాలి. అంతగా తన లుక్‌ని మార్చుకున్న పృథ్వీరాజ్ మూవీ అవుట్‌ పుట్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఆయన కాన్ఫిడెంట్‌ చూస్తే మూవీ హిట్‌ పక్కా అనేలా ఉంది. అలా ట్రైలర్‌తో బజ్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య మార్చి 28న రిలీజ్‌ అవుతుంది. మరి విడుదల అనంతరం ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 


పృథ్వీరాజ్ జోడిగా అమలా పాల్!


అయితే, ఈ చిత్రంలో పృథ్వీరాజ్ భార్యగా అమలాపాల్ నటించింది. బెన్యామిన్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తెరకెక్కించారు. షూటింగ్ అంతా దాదాపుగా జోర్డాన్, అల్జీరియాలోని సహారా ఎడారిలో కఠినమైన పరిస్థితుల్లో చిత్రీకరించారు. ప్రొడక్షన్ కోసం ఇండియాకు, యూఎస్ కు చెందిన నాలుగు కంపెనీలు వర్క్ చేయటం విశేషం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్, అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా 3D లోనూ విడుదల కానుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..ఇండియా నుంచి నెక్ట్స్ బిగ్గెస్ట్ సెన్సేషన్ గా ఆడుజీవితం అవుతుందని మలయాళం ఫిలిం ఇండస్ట్రీ భావిస్తోంది.


Also Read: తల్లికాబోతున్న దీపికా పదుకొనె? - బేబీ బంప్‌ ఫొటో వైరల్‌!