Is Deepika Padukone Pregnant?: బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనె ఇంటర్నేషనల్‌ వేదికపై మెరిసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ అవార్డ్స్ బాఫ్టా వేడుకలకు ఆమె సంప్రదాయంగా చీరకట్టులో మెరిసింది. దీంతో అందరి కళ్లు ఆమెపైనే పడ్డాయి. అక్కడ ఈ బ్యూటీ ఫొటోలకు ఫోజులు ఇచ్చిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలను సరిగ్గా చూడగా అసలు విషయం బయపడ్డది. త్వరలో ఈ బ్యూటీ గుడ్‌న్యూస్‌ చెప్పబోతుందా? ఆమె తల్లి కాబోతుందా? అంటున్నారు. వీటికి గట్టి సమధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాఫ్టా అవార్డు వేడుకలో ఫ్యాన్సీ శారీలో తళుక్కుమన్న దీపికా బంప్‌ కాస్తా ముందుకు కనిపించింది. ఇలాంటి వేడుకలు అంటే ఆమె ఎప్పుడూ ట్రెండీ వేర్‌ను ప్రీఫర్ చేస్తుంది. ఆస్కార్‌ టైంలో ఆమె ట్రెండీ డ్రెస్సుల్లో, సింగిల్‌ పీస్‌ డ్రెస్సుల్లో మెరిసింది.


కానీ ఈసారి మాత్రం చీరకట్టుకుని సంప్రదాయం కనిపించింది. అంతేకాదు ఇందులో ఆమె తన పొట్ట కనిపించకుండ పూర్తిగా కవర్‌ చేసింది. దీంతో ఆమె ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ఉందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ ఫొటోలు కూడా అవి నిజమే అనెట్టుగానే ఉన్నాయి. అంతేకాదు ఈ అవార్డు ఫంక్షన్‌ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఇక కూడా వదులుగా ఉండే దుస్తులు ధరించింది. ఇక్కడ కూడా పొట్ట కనిపించకుండా లూజ్‌ ఔటోఫిట్‌ వేసుకోవడంతో అంతా దీపికా ప్రెగ్నెన్సీని కన్‌ఫాం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ బ్యూటీ గుడ్‌న్యూస్‌ చెప్పబోతుందంటూ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజం అయితే కల్కీ సినిమా షూటింగ్‌ పరిస్థితి ఎంటా? అనే ఆలోచనలో పడ్డారు.






అంతేకాదు ఆమె చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్‌ కూడా ఉన్నాయి. బాలీవుడ్‌లో పలు బిగ్‌ ప్రాజెక్ట్స్‌కి కమిట్‌ అయ్యింది. అందులో అందులో సింగం రిటర్న్స్‌ ఒకటి. ఆమె సైన్‌ చూసిన చిత్రాల్ని పాన్‌ ఇండియా ప్రాజెక్ట్సే. ఇలాంటి టైం దీపికా గర్భం దాల్చడంతో మూవీ లవర్స్‌ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని ఈ వార్త కాస్తా డిసప్పాయింట్‌ చేస్తుంది. దీపికా నుంచి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ఇలాంటి గుడ్‌న్యూస్‌ రావడం చాలా సంతోషమే అయినా, కల్కీ ఇంకా సెట్స్‌పై ఉండగానే ప్రెగ్నెన్సీ వార్తలు వినిపించడం కాస్తా టెన్షన్‌ పెట్టే విషయమే అని చెప్పాలి. మరోవైపు కల్కీ, సింగం రిటర్న్స్‌ చిత్రాల చిత్రీకరణ చివరిలో ఉన్నాయి. అంటే ఇప్పటికే దీపికా షూటింగ్ పార్ట్ పూర్తయ్యే చాన్స్‌ కూడా ఉంది.కాబట్టే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా? అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.






ఏదేమైన దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు మాత్రం ఫ్యాన్స్‌, మూవీ లవర్స్‌ని ఈ ప్రశ్నలు తొలుస్తూనే ఉంటాయి. మరి వీటికి దీపికా ఎప్పుడు చెక్‌ పెడుతుందో చూడాలి. కాగా దీపికా పదుకొనె బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలం ప్రేమలో మునిగితేలిన ఈ స్టార్‌ జంట 2018 నవంబర్‌లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. విదేశాల్లో జరిగిన వీరి డెస్టెనేషన్‌ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లయి ఐదేళ్లు గడిచిన ఈ జంట నుంచి ఇప్పటివరకు గుడ్‌న్యూస్‌ వినిపించలేదు. గతంలోనూ దీపికా ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వినిపించాయి. కానీ అవి నిజం కాదని తేలిపోయింది. మరి ఈసారైన దీపికా ఈ వార్తలను నిజం చేస్తుందా? లేదో చూడాలి!