Premalu Telugu Release: ప్రేమలు... పేరు చూస్తే తెలుగు సినిమా తరహాలో ఉంది కదూ! కానీ, ఇదొక మలయాళ సినిమా. హైదరాబాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో విపరీతంగా ఆడుతోంది. మ్యాగ్జిమమ్ ప్రతి షో హౌస్ ఫుల్ అవుతోంది. హైదరాబాద్ సిటీలో ఉన్న మలయాళ ప్రేక్షకులు మాత్రమే కాదు... తెలుగు జనాలు సైతం ఈ సినిమా చూస్తున్నారు. ఎందుకు? అంటే... హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన మాలీవుడ్ ఫిల్మ్ కనుక! అయితే... సినిమా టాక్ చూసి మలయాళం అర్థం కాదని, తెలుగులో వస్తే చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి.
రాజమౌళి కుమారుడి చేతికి డబ్బింగ్ హక్కులు!
SS Karthikeya will be releasing the Malayalam blockbuster Premalu in Telugu: 'ప్రేమలు' తెలుగు డబ్బింగ్ హక్కులు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు, యువ నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ సొంతం చేసుకున్నారని తెలిసింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు సంభాషణలు రాయిస్తున్నారట. ప్రస్తుతం ఆ పనులు ప్రారంభించారని తెలిసింది.
శివరాత్రి కానుకగా తెలుగులో 'ప్రేమలు' విడుదల'
'ప్రేమలు' తెలుగు డబ్బింగ్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం'' అని ఎస్ఎస్ కార్తికేయ సన్నిహితులు తెలిపారు.
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు
మలయాళ నిర్మాతల్లో ఫహాద్ ఫాజిల్ ఒకరు!
'ప్రేమలు'ను మలయాళంలో ప్రొడ్యూస్ చేసిన వాళ్లలో ఫహాద్ ఫాజిల్ ఒకరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాతో తెలుగులో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు ఆయన నటించిన కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో అనువాదమై మంచి పేరు తెచ్చుకున్నాయి. గిరీష్ ఏడీ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.
'ప్రేమలు' సినిమాలో నస్లీన్ కె గఫూర్, మమతా బైజు జంటగా నటించారు. వాళ్ళిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతే కాదు... 'ప్రేమలు' చూసిన తెలుగు దర్శక నిర్మాతలు కొందరు మమత డేట్స్ కోసం ట్రై చేస్తున్నారని టాక్. త్వరలో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యే అవకాశం ఉంది.
మార్చి 8న తెలుగులో మరో రెండు సినిమాలు
ఆల్రెడీ రెండు తెలుగు సినిమాలు మార్చి 8న విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. అందులో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' ఒకటి. ఆ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. మరొక సినిమా... విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి'. ఆ రెండు సినిమాల జానర్స్ వేరు. 'ప్రేమలు' జానర్ వేరు. సో... మూడు సినిమాల మధ్య పోటీ ఏమీ ఉండదు. ప్రేక్షకులు తమ అభిరుచిని బట్టి ఏ సినిమాకు వెళ్లాలనేది డిసైడ్ అవుతారు.