Preethi Pagadala Super Reply To Reporter: జీ తెలుగు ‘స‌రిగ‌మప’ కంటెస్టెంట్ ప్ర‌ణ‌వ్ కౌశిక్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి ప‌గ‌డాల‌, వంశీ పూజిత్ కీలక పాత్రల్లో న‌టించిన సినిమా 'ప‌తంగ్'. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమాకి సంబంధించి టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ నిర్వ‌హించారు. టీచ‌ర్ లాంజ్ త‌ర్వాత‌.. మీడియాతో మాట్లాడింది సినిమా టీమ్. ఈ సంద‌ర్భంగా ఒక రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్నకి అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చింది హీరోయిన్ ప్రీతి ప‌గ‌డాల‌. ఏమ‌న్నారంటే? 


అనుకోకుండా హీరోయిన్ అయ్యాను.. 


"మీరు టిక్ టాక్‌లు, రీల్స్ చూశాను. ఎప్పుడైనా హీరోయిన్ అవుతార‌ని అనుకున్నారా?" అని అడిగిన ప్ర‌శ్న‌కి ప్రీతి ఇలా ఆన్స‌ర్ ఇచ్చారు. "అస్స‌లు అనుకోలేదు. నేను డెంటిస్ట్ అవ్వాలి అనుకున్నాను. స్టోరీ చూసి.. నేను ఆడిష‌న్‌కు పంపాను. 'ప‌తంగ్'లో చేయాలని ఫొటోలు పంపాను" అని అన్నారు. "రీల్స్ కి వ‌చ్చిన వ్యూవ్స్ లాగా టికెట్లు తెగ‌వు.. ఈ సినిమా ఎందుకు చూడాలి అనేది ఒక ఇన్ ఫ్ల్యూయెన్స‌ర్ గా ఎలా చెప్తారు?" అని అదే రిపోర్ట‌ర్ ఆమెను ప్రశ్నించాడు. ఇందుకు ప్రీతి బదులిస్తు "ఒక ఇన్ ఫ్ల్యూయెన్స‌ర్ గా నేనేం చెప్తాను. టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ చూస్తే నా హార్డ్ వ‌ర్క్ తెలుస్తుంది. అదే ఔట్ క‌మ్ వ‌స్తుంది. ఇన్ స్టాలో ఏం చేస్తానో అది ఇన్‌స్టా వ‌ర‌కే. ఇక్క‌డ ఏం చేస్తానో అది వేరే. రెండింటికీ అస‌లు సంబంధం లేదు. రెండు టూ పీస్ ఆఫ్ వ‌ర్క్స్ అంతే. నీ లోప‌ల ఏం అనుకుంటునావో నాకు ఇంకా తెలీదు. నాది మాత్రం హార్డ్ వ‌ర్క్ అంతే" అంటూ ఆన్స‌ర్ ఇచ్చారు ప్రీతి. 


ఆక‌ట్టుకుంటున్న టీజ‌ర్.. 


కామెడీ జోన‌ర్‌లో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా స్పోర్ట్స్ సినిమాలు వ‌చ్చాయి. కానీ, ప‌తంగ్ ఎగ‌రేసే ఆధారంగా ఎలాంటి సినిమాలు రాలేదు. అయితే, ఈ సినిమా ప‌తంగ్ పోటీలు, కామెడీ జోడించి తీస్తున్నారు. ఇక ఇప్పుడు రిలీజైన టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ఈ సినిమా టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. నేచుర‌ల్ గా, కంప్లీట్ యూత్‌‌‌‌ ఫుల్‌‌‌‌ కామెడీ ఎంటర్టైనర్ గా 'పతంగ్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.


ఈ సినిమాకి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటిక్ ఎలిమెంట్స్ & రిష‌న్ సినిమాస్ బ్యానర్ పై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా.. నిఖిల్ కోడూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శ‌క్తి అర‌వింద్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకి జోస్ జిమ్మీ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందించారు. చాణ‌క్య రెడ్డి ఎడిట‌ర్‌‌గా, వెంక‌ట్ శాతావాహ‌న‌ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ ఆటా సందీప్ కొరియోగ్రఫీ చేశాడు. మేఘన శేషవపురి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా పని చేశారు. చాలా కాలంగా నిర్మాణం జరుపుకుంటున్న 'పతంగ్' సినిమాని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.


Also Read: అందుకే.. హర్రర్ సినిమాలంటే ఇష్టం, ఆ దెయ్యాలే బెటర్: పవన్ కళ్యాణ్