Prasanth Varma's cryptic post is sparking curiosity among the audience: 'హను మాన్' సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ భారీ విజయం అందుకున్నారు. దీనికి ముందు తీసిన 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాలు అందించాయి. అయితే... 'హను మాన్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ప్రశాంత్ వర్మకు గుర్తింపు తెచ్చింది. దాంతో ఆయన తర్వాత సినిమా గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇవాళ సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.


బాబు... రెడీ బాబు!
''నాకు సంతోషం కలిగించే ప్లేసుకు మళ్ళీ వచ్చేశా. బాబు... రెడీ బాబు'' అంటూ ఈ రోజు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. షూటింగ్ లొకేషన్ ఫోటో షేర్ చేశారు. దాంతో ఆయన దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలైందని అర్థం అయ్యింది. అయితే, అది ఏంటి? అనేది క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్సులో ఉంచారు ప్రశాంత్ వర్మ!


Also Readజగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!






బాలకృష్ణతో ఓటీటీ కోసం యాడ్ తీస్తున్నారా?
దర్శకుడు బోయపాటి శ్రీను తాను తీసిన ప్రతి సినిమాకు ముందు 'బాబు... రెడీ బాబు' అని తాను స్వయంగా చెప్పిన వీడియో ముందు ప్లే చేస్తారు. ఆ వ్యాఖ్యలు చెప్పడంతో సినిమానా? అని డౌట్ కలుగుతోంది. లేదంటే యాడ్ ఫిల్మ్ షూటింగ్ ఏదైనా చేస్తున్నారా? అని సందేహం కలుగుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు, ప్రశాంత్ వర్మకు మధ్య మంచి అనుబంధం ఉంది. 'అన్ స్టాపబుల్' షో కోసం ఇద్దరూ కలిసి పని చేశారు. యాడ్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త సీజన్ కోసం యాడ్ చేస్తున్నారా? ప్రశాంత్ వర్మ చెప్పే వరకు అసలు విషయం తెలియదు.


Also Readయాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?


కొత్త సినిమా స్టార్ట్ చేశారా? ఒకవేళ చేస్తే ఎవరితో?
Prasanth Varma New Movie: 'హను-మాన్' విజయం తర్వాత సీక్వెల్ చేస్తానని ప్రశాంత్ వర్మ తెలిపారు. మధ్యలో మరో సినిమా చేసే అవకాశం కూడా ఉందట! 'జై హనుమాన్'కు ముందు ఆయన ఏ సినిమా చేస్తారు? ఎవరితో సినిమా చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి 'హనుమాన్' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాను హీరో తేజా సజ్జాతో పాటు వెళ్లి కలిశారు. అభినందనలు అందుకున్నారు.