Senior Actor Prakash Raj : టాలీవుడ్ విలక్షణటుడు ప్రకాష్ రాజ్ తాజాగా మంచు విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండేళ్ల క్రితం మా ఎన్నికలు(MAA Elections) జరిగినప్పటి నుంచి మంచు విష్ణు పై ఏదో ఒక ఆరోపణ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మంచు విష్ణు పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రకాష్ రాజ్ రెండు సంవత్సరాల క్రితం జరిగిన మా ఎన్నికల్లో మంచి విష్ణు చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు కచ్చితంగా గెలుస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత ఓడిపోవడంతో మీడియాతో మాట్లాడుతూ గెలుపు, ఓటమి సహజం. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం అడిగే హక్కు తనకు ఉందని చెప్పాడు. చెప్పినట్లుగానే తాజాగా మంచు విష్ణు పై ఫైర్ అయ్యాడు.


ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలిచి రెండేళ్లు అయిపోయాయి. కానీ ఇప్పటివరకు ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించలేదు. కనీసం మా బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు. ఆయన్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న సభ్యులు ఇప్పుడు ఆలోచించాలి. మా ఎన్నిక‌ల్లో విష్ణుకు ఓటు వేసిన వారే ఓడిపోయారరు. విష్ణు ఇచ్చిన హ‌మీలు గురించి దొంగ ఓట్లు వేసిన వాళ్లు అడ‌గ‌లేరు. వాళ్ల‌కు నోరు ఉండ‌దు. బోగస్ ఓట్ల వల్ల చాలామంది బయట నుంచి వచ్చే ఓట్లు వేయడం వల్లే ఆయన గెలిచాడు, తప్పితే ఈ రెండేళ్లలో ఆయన చేసిందేమీ లేదు సున్నా. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఓడిపోయారు, ఎవ‌రూ గెలిచారు అన్న‌ది కాకుండా ఓటు వేసిన వాళ్లు తాము ఓడిపోయామా? గెలిచామా? అన్న‌ది ఆలోచించుకోవాలి" అని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.


దీంతో ఆయన చేసిన కామెంట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకి ఏదో ఒక సందర్భంలో ధీటుగా సమాధానమిచ్చే మంచు విష్ణు ఈసారి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఏకీభవిస్తుండగా మరికొందరు ఖండిస్తున్నారు. ఇక నటుడిగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడు. అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా బీజేపీపై ప్రకాష్ రాజ్ చేసే విమర్శలు వైరల్ అవుతుంటాయి. కాగా మంచు విష్ణు ప్యాన‌ల్ ప‌ద‌వీ కాలం ఇటీవ‌లే ముగిసింది. ఆ ప‌ద‌వీ కాలాన్ని వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు పొడిగించారు. మ‌ళ్లీ వ‌చ్చే ఏడాది మా ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు పోటీ చేసే ఆలోచ‌న లేద‌ని తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు ప్రకాష్ రాజ్. మరి వచ్చే ఎన్నికల్లో మా అసోసియేషన్ ప్రెసిడెంట్(MAA Association Presedent) గా ఎవరు పోటీ చేస్తారో చూడాలి.


Also Read : మొన్న రష్మిక, నేడు కాజోల్ - మరీ దారుణమైన వీడియోను పోస్ట్ చేసిన ‘ఫేక్’గాళ్లు!