విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్రస్తుతం మైసూర్ లో ఉన్నారు. ఆయన కన్నడిగ అనేది తెలిసిన సంగతే. అయితే... మన తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఎందుకు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
డీప్ ఫేక్ ఫోటో మీద ప్రకాష్ రాజ్ కంప్లైంట్
'జస్ట్ ఆస్కింగ్'... అంటూ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో ఎటువంటి మొహమాటం లేకుండా వ్యక్తం చేసే భారతీయుడు ప్రకాష్ రాజ్. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వాన్ని పలు సందర్భాలలో ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడతారు. అయితే... ప్రకాష్ రాజ్ ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది లేదు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్లారు? అంటే...
మహా కుంభమేళా (Mahakumbh 2025)కు ప్రకాష్ రాజ్ వెళ్లారని, త్రివేణి సంఘంలో ఆయన పుణ్య స్నానం ఆచరించారని సోషల్ మీడియాలో ఒక డీప్ ఫేక్ ఫోటో (Prakash Raj Deep Fake Photo) వైరల్ అవుతోంది. అది ప్రకాష్ రాజ్ దృష్టికి కూడా వెళ్ళింది. దాంతో ఆయన మైసూర్ పోలీస్ స్టేషనుకు వెళ్లి సదరు ఫోటోను వైరల్ చేస్తున్న వ్యక్తులతో పాటు ఆ ఫోటో క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Also Read: ఏపీ సీఎం నారా చంద్రబాబు ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ కోసం, ఎప్పుడంటే?
Prakash Raj Upcoming Movies: ప్రకాష్ రాజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే, అడవి శేష్ హీరోగా రూపొందుతున్న సూపర్ హిట్ 'గూడచారి' సీక్వెల్ 'గూడచారి 2'లో కూడా ఆయన నటిస్తున్నారు. తమిళంలో సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న 'రెట్రో'లో కీలక పాత్ర చేశారు. దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న 'జన నాయగన్' సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ఆయన చేతిలో మలయాళ, తమిళ సినిమాలు ఉన్నాయి. ఎలా లేదన్నా ఈ ఏడాది ప్రకాష్ రాజ్ నటించిన అర డజను సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ప్రభాస్... సాయి పల్లవి... ఈసారైనా కాంబినేషన్ సెట్ అవుతుందా?