ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. శనివారం ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి ఆ ఫామ్ హౌస్‌లో పార్టీ జరగనుంది. అది బాలకృష్ణ కోసం! పార్టీ ఎవరు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? వంటి వివరాల్లోకి వెళితే...


పద్మ భూషణ్ బాలకృష్ణ కోసం...
సోదరి భువనేశ్వరి ఏర్పాటు చేసిన పార్టీ
గాడ్ ‌ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కేవలం కథానాయకుడు మాత్రమే కాదు... ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే ఒక దార్శనికుడు ఉన్నాడు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. సామాజిక బాధ్యత గల రాజకీయ నాయకుడు ఉన్నాడు. హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ రికార్డు నెలకొల్పారు. శాసన సభ్యుడిగా అంతఃకరణ శుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారు. 


నటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. త్వరలో ఆయన్ను సత్కరించనుంది. నటుడిగా మాత్రమే కాదు... సమాజానికి ఆయన చేస్తున్న సేవలు సైతం ఈ పురస్కారం రావడంలో ప్రధాన పాత్ర పోషించాయి. బాలకృష్ణకు పద్మ భూషణ్ రావడంతో నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. 


తమ్ముడికి పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు సతీమణి, బాలకృష్ణ సోదరి భువనేశ్వరి ఒక పార్టీ ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలోని తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అది ఏర్పాటు చేశారని సమాచారం. 


తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు టాలీవుడ్ ప్రముఖులు!
బాలకృష్ణకు పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా నారా భువనేశ్వరి ఇస్తున్న పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారట.


Also Read: ప్రభాస్... సాయి పల్లవి... ఈసారైనా కాంబినేషన్ సెట్ అవుతుందా?


బాలకృష్ణ ఇమేజ్ ఇటీవల మరింత పెరగడంలో, మహిళా ప్రేక్షకులతో పాటు యువతకు ఆయనను దగ్గర చేయడంలో ఆహా ఓటీటీ‌ టాక్ షో 'అన్ స్టాపబుల్' ఎంతో హెల్ప్ అయ్యింది. షో రూపకల్పనలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పాత్ర మరువలేనిది. దానికి కర్త, కర్మ, క్రియ ఆయనే. ఆయనతో పాటు నిర్మాతలు చాలా మందిని ఆహ్వానించారట. బాలకృష్ణ జనరేషన్ హీరోలతో పాటు యంగ్ జనరేషన్ హీరోలు కూడా కొందరు హాజరు కానున్నారు. ఈ పార్టీకి ఎవరెవరు వస్తారో చూడాలి. ద్మ భూషణ్ పురస్కారం కేవలం తనది మాత్రమే కాదని, తెలుగు చిత్రసీమకు దక్కిన పురస్కారం ఇదని ఇటీవల బాలకృష్ణ ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రజెంట్ ఆయన చేస్తున్న సినిమాలకు వస్తే... సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన 'అఖండ 2' చేస్తున్నారు. 


Also Readహీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?