Prahlad Promo From Mahavatar Narasimha Movie: కాంతార, కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'మహావతార్: నరసింహ'తో వస్తోన్న సంగతి తెలిసిందే. 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా ఎపిక్ మూవీస్ తెరకెక్కిస్తుండగా వరుస వీడియోలతో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు మేకర్స్.


'ప్రహ్మాద్' ప్రోమో అదుర్స్


'మహావతార్: నరసింహ' నుంచి ప్రహ్లాదుడి పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమో గూస్ బంప్స్ తెపిస్తోంది. 'నీ వంటి పరమ భక్తులు అనంతమైన ఈ కాలచక్రంలో ఒక్కసారి జన్మిస్తారు.' అనే డైలాగ్‌తో ప్రోమో స్టార్ట్ కాగా నరసింహుని పరమ భక్తుడిగా ప్రహ్లాదుని ఎంట్రీ అదిరిపోయింది. 'కచ్చితంగా ఏదో ఒక దివ్య శక్తి ఈ బాలున్ని కాపాడుతోంది.', 'ఒకే నామం మన జీవితంలో ఉన్న అన్నీ కష్టాలకు సమాధానం. ఓ నమో భగవతే వాసుదేవాయ' అంటూ ప్రహ్లాదుడు చెప్పిన డైలాగ్ భక్తి పారవశ్యంలో మునిగేలా చేసింది.



విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. మహావతార్ సిరీస్‌ల్లో ప్రధానమైన 'నరసింహ' అవతారాన్ని 'మహావతార్: నరసింహ'గా తెరకెక్కుతుండగా... అశ్విని కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల రాక్షసరాజు హిరణ్యకశిపుని పాత్రను సైతం రిలీజ్ చేశారు. యానిమేషన్‌లో ఈ మూవీ ఓ బెంచ్ మార్క్ సృష్టిస్తుందని డైరెక్టర్ తెలిపారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






Also Read: 'తమ్ముడు' రివ్యూ: అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? నితిన్ సినిమా హిట్టా? ఫట్టా?


'కాంతార' ప్రీక్వెల్, కేజీఎఫ్, సలార్ మూవీస్ సీక్వెల్‌తో పాటు విష్ణుమూర్తి అవతారాలే ప్రధానాంశంగా 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా 3డీ యానిమేటెడ్ మూవీస్‌ను నిర్మించనున్నట్లు 'హోంబలే ఫిల్మ్స్' తెలిపింది. ఈ ప్రాజెక్టులు రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం 7 సినిమాలు 2037 వరకూ రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.


ఆ 7 ప్రాజెక్టుల లిస్ట్ ఇదే..



  • మహావతార్: నరసింహ - 2025 జులై 25

  • మహావతార్: పరశురామ్ - 2027

  • మహావతార్: రఘునందన్ - 2029

  • మహావతార్: ద్వారకాదీశ్ - 2031

  • మహావతార్: గోకులానంద్ - 2033

  • మహావతార్: కల్కి 1 - 2035 

  • మహావతార్: కల్కి 2 - 2037


'మన పురాణ గాథలను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. విష్ణుమూర్తి అవతారాలపై మూవీస్ తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భారీ ఎపిక్ సినిమాటిక్ జర్నీకి రెడీగా ఉండండి. ఆడియన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మా టీం నిరంతరం కృషి చేస్తోంది.' అంటూ రాసుకొచ్చింది. ఫస్ట్ మూవీ 'మహావతార్: నరసింహ'ను ఈ నెల 25న 3Dలో ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.