Pradeep Ranganathan's Dude Movie USA Premiere Show Report: 'లవ్ టుడే', 'డ్రాగన్' విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన సినిమా 'డ్యూడ్'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. దానికి తోడు 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్ కావడంతో తెలుగులోనూ క్రేజ్ నెలకొంది. మరి ఈ సినిమా ఫస్ట్ షో ఎప్పుడు పడుతోంది? ట్విట్టర్ రివ్యూస్, యూఎస్ ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? అనేది చూస్తే...

Continues below advertisement

అమెరికాలో 'డ్యూడ్' మొదటి షో...ఎప్పుడు మొదలు అవుతుందంటే?అమెరికాలో 'డ్యూడ్' మొదటి షో మొదలు అవుతుంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇండియా కంటే అమెరికాలో కాస్త ముందుగా షోలు పడుతున్నాయి.

Also Read: 'డ్యూడ్' ట్విట్టర్ రివ్యూ: 'తొలిప్రేమ', 'ఖుషి'లో పవన్ గుర్తొచ్చేలా ప్రదీప్ రంగనాథన్ నటన... ట్విస్ట్ మాత్రం అల్లు అర్జున్ - సుక్కు సినిమా నుంచి లేపేశారా? డీటెయిల్డ్ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకోండి

Continues below advertisement

ఇండియన్ టైమింగ్ ప్రకారం... అమెరికాలో శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర (3.30) గంటలకు 'డ్యూడ్' మొదటి షో పడుతోంది. అదే ఫస్ట్ షో. తెలుగు రాష్ట్రాలకు వస్తే... హైదరాబాద్ సిటీలో కొన్ని చోట్ల ఉదయం ఎనిమిది గంటలకు సినిమాను ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో ఉదయం తొమ్మిది గంటలకు మొదటి షో ప్రదర్శిస్తున్నారు. తమిళ్ కంటే ముందుగా తెలుగు షోస్ పడుతున్నాయి.

ప్రీమియర్స్ రిపోర్ట్ ఏ టైంకి వస్తుంది?మరి 'డ్యూడ్' ట్విట్టర్ రివ్యూస్ వచ్చేదెప్పుడు??Dude Runtime: 'డ్యూడ్' రన్ టైమ్ 2.19 గంటలు. శుక్రవారం ఎర్లీ మార్నింగ్ మూడున్నర గంటలకు (ఇండియన్ టైమింగ్ ప్రకారం) అమెరికాలో షో పడితే... అది కంప్లీట్ అయ్యేసరికి టైం 6 అవుతుంది. ఇండియాలో ఆడియన్స్ నిద్ర లేచే సమయానికి, ఇండియాలో మొదటి షో పడే సమయానికి ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ షో రిపోర్ట్స్ వచ్చేస్తాయి.

Also Readడ్యూడ్ vs తెలుసు కదా... బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? సిద్ధూ, ప్రదీప్... ఎవరి సినిమాకు క్రేజ్ ఎక్కువ?

'లవ్ టుడే'తో ప్రదీప్ రంగనాథన్ హీరోగా పరిచయం అయ్యారు. అంతకు ముందు ఆయన రవి మోహన్ 'కోమలి'కి డైరెక్షన్ చేశారు. హీరోగా మొదటి సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఐదు కోట్లతో తీసిన ఆ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది. 'లవ్ టుడే' తర్వాత 'డ్రాగన్' చేశారు. అదీ వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రెండు సినిమాల తర్వాత 'డ్యూడ్' చేశారు. ఈ సినిమా సైతం వంద కోట్లు కలెక్ట్ చేస్తే ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో హ్యాట్రిక్ 100 క్రోర్స్ మూవీస్ ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మరొక విజయం పడుతుంది. 

Also Read: ఇండియాలోనే 'తెలుసు కదా' ఫస్ట్ షో... టిల్లు భాయ్ లేటెస్ట్‌ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?