Pradeep Ranganathan's Dude Movie Twitter Review In Telugu: ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డ్యూడ్'. 'లవ్ టుడే', 'డ్రాగన్'... బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఆయన నటించిన చిత్రమిది. ఇందులో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్. దాంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి మూవీ ఎలా ఉంది? అంటే... అమెరికాలో ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. అక్కడ టాకేంటి? ఎన్నారై ఆడియన్స్ 'డ్యూడ్' గురించి ఏమంటున్నారు? అనేది తెలుసుకోండి.
'తొలిప్రేమ', 'ఖుషి'లో పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేలా...'డ్యూడ్'లో ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ చూస్తే 'తొలిప్రేమ', 'ఖుషి' సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తారని ఎన్నారై ఆడియన్స్ అంటున్నారు. ఆ స్థాయిలో పాత్రలో లీనమై నటించారట. మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్ మధ్య కెమిస్ట్రీ సైతం సూపర్ ఉందని యూఎస్ ప్రీమియర్ షోస్ నుంచి వచ్చిన టాక్. వాళ్లిద్దరి నటన వల్ల మూవీ ఫ్రెష్‌గా అనిపిస్తుందట.
రొమాంటిక్ కామెడీ మూవీ... బన్నీ సినిమాలో ట్విస్ట్!రోమ్ - కామ్ (రొమాంటిక్ కామెడీ)గా 'డ్యూడ్' తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో ఓ ట్విస్ట్, మెయిన్ ప్లాట్ చూస్తే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఒకటి గుర్తుకు వస్తుందట. అయితే అది ఏ సినిమా అనేది థియేటర్లలో 'డ్యూడ్' చూసి తెలుసుకోవాలి.
తమిళ్ ఆడియన్స్ కంటే తెలుగోళ్లకు నచ్చిన 'డ్యూడ్'ప్రోపర్ రొమాంటిక్ కామెడీ సినిమా 'డ్యూడ్' అని ఎన్నారై ఆడియన్స్ అందరూ చెప్పే మాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే... తమిళ్ కంటే తెలుగు ఆడియన్స్ నుంచి 'డ్యూడ్'కు ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ్ జనాలు సోసోగా ఉందని అంటే... మనోళ్లు బావుందని చెబుతున్నారు.
సీరియస్ సిట్యువేషన్స్ ను చక్కగా వినోదాత్మకంగా చెప్పడం బావుందని చాలా మంది చెప్పారు. జోక్స్ బాగా వర్కవుట్ అయ్యాయట. మరి ఇండియన్ ఆడియన్స్ నుంచి సినిమాకు ఎటువంటి టాక్ వస్తుందో చూడాలి. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో సినిమాపై జనాలు ఏమన్నారో వెబ్ స్టోరీ కింద చూడండి.