Prabhas About Hombale Films Banner Big Projects: 'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి భారీ హిట్ ప్రాజెక్ట్స్ నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలో ఫిల్మ్స్'... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 3 భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై తాజాగా ప్రభాస్ స్పందించారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అందుకే వరుస ప్రాజెక్టులు
'హోంబలే ఫిల్మ్స్' బ్యానర్‌లో వర్క్ చేయడం తనకు ఎంతో స్పెషల్ అని ప్రభాస్ అన్నారు. 'విజయ్ కిరంగదూర్ వల్లే ఈ సంస్థ ఈ స్థాయిలో ఉంది. 'సలార్'తో మా జర్నీ మొదలు కాగా మేమంతా ఓ కుటుంబంలా మారాం. ఆయన నాకొక ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. 'కేజీఎఫ్' షూట్ సమయంలో ఓ సెట్ వేయగా అనుకోని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బడ్జెట్ విషయంలో టీం అంతా ఎంతో కంగారుపడ్డారు.
'కంగారు పడొద్దు. డబ్బు విషయంలో ఏమాత్రం ఆలోచించొద్దు. అనుకున్న విధంగా సినిమా చేయండి.' అంటూ విజయ్ ధైర్యం చెప్పారు. సినిమా మేకింగ్, క్వాలిటీ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కారు. ఆ విషయం నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో వరుస ప్రాజెక్టులు చేస్తున్నా.' అంటూ స్పష్టం చేశారు.
Also Read: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీపై బిగ్ అప్డేట్! - ఫస్ట్ టైం నయనతారతో చిరు రొమాంటిక్ సాంగ్?
గతేడాది చివర్లో ప్రభాస్‌తో చేయబోయే 3 భారీ ప్రాజెక్టుల గురించి అనౌన్స్ చేసింది 'హోంబలే ఫిల్మ్స్'. ఇండియన్ సినిమా ఖ్యాతిని వరల్డ్ స్థాయిలో విస్తరించేలా ప్రభాస్‌తో మూడు చిత్రాల భాగస్వామ్యంలో వర్క్ చేయడం ఆనందంగా ఉన్నట్లు తెలిపింది. 'ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనేదే మా లక్ష్యం. ఇందుకు వేదిక సిద్ధమైంది. 'సలార్ 2'తో మా ప్రయాణం మొదలవుతుంది.' అని ప్రకటించింది. 2026, 2027, 2028ల్లో ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుందని చెప్పగా... 'సలార్' సీక్వెల్ తప్ప మిగిలిన ప్రాజెక్టుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హోంబలే బిగ్ ప్రాజెక్ట్స్
'హోంబలే ఫిల్మ్స్' (Hombale Films) నిర్మాణ సంస్థ తొలిసారిగా పునీత్ రాజ్ కుమార్‌తో 'నిన్నిందలే' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యశ్‌తో 'కేజీఎఫ్' నిర్మించగా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 'కాంతార', 'సలార్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్‌తో పాటు 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా 7 బిగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది. విష్ణుమూర్తి 10 అవతారాలను తెరకెక్కించనుంది.
అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో 7 సినిమాలు రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులై 25న 'మహావతార్: నరసింహ'ను రిలీజ్ చేయనుండగా... పరశురామ్ (2027), రఘునందన్ (2029), ద్వారకాదీశ్ (2031), గోకులానంద్ (2033), కల్కి 1 (2035), కల్కి 2 (2037) ఇలా వరుసగా మూవీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే 'మహావతార్: నరసింహ'కు సంబంధించి నరసింహుడు, ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుడుకి సంబంధించి స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటున్నాయి.