Prabhas and Prashanth Varma movie latest news: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టైటిల్ 'బ్రహ్మ రాక్షస' కాదని... కొత్త టైటిల్ ఖరారు చేస్తారని ఫిలిం నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అది ఏమిటో తెలుసా?
బ్రహ్మ రాక్షస కాదు... 'బక', టైటిల్ ఇదే ఇక!Prabhas mythological movie titled Baka: మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుని ఆధారంగా ప్రభాస్ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ రాసుకున్నారని, ఆ కథకు 'బక' అనే టైటిల్ అనుకుంటున్నారని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల కథనం. ఇందులో టైటిల్ రోల్ 'బక'గా ప్రభాస్ కనిపిస్తారని టాక్.
హీరో మారడంతో టైటిల్ మారిందా? ట్విస్ట్!'హనుమాన్'తో గత ఏడాది సంక్రాంతికి దర్శకుడు ప్రశాంత్ వర్మ భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మరొక సినిమా పట్టాలు ఎక్కించలేదు. ప్రతి సంక్రాంతికి తన నుంచి ఒక సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది తన సంకల్పమని చెప్పిన దర్శకుడు ఏడాది అంతా వేచి చూడాల్సి వచ్చింది.
హిందీ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా 'బ్రహ్మ రాక్షస' సినిమా ప్రారంభించారు ప్రశాంత్ వర్మ. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి ఒక్క రోజు ముందు ఆ ప్రాజెక్ట్ ఆగింది. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఏమిటి? అనేది డైలమాలో పడిందని అనుకుంటున్న తరుణంలో ప్రభాస్ హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చింది.
Also Read: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టిన రోజు... ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ చేయాలని అనుకున్న 'బ్రహ్మ రాక్షస' సినిమాను ప్రభాస్ హీరోగా చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలలో బలంగా వినపడింది. కథ కూడా అదే! కానీ, హీరో మారడంతో ఇప్పుడు టైటిల్ కూడా మారింది. 'బ్రహ్మ రాక్షసి' కాస్త 'బక' అయింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ నిర్మాణ వ్యయంతో ఖర్చుకు రాజీ పడకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ప్రభాస్ సరసన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే?ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసే సినిమాలో హీరోయిన్ రోల్ బ్యూటిఫుల్ లేడీ భాగ్యశ్రీ బోర్సే సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు ఆవిడ కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన 'ఆంధ్ర కింగ్ తాలూకా', దుల్కర్ సల్మాన్ సరసన 'కాంత' సినిమాలు చేసే అవకాశం అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా ఛాన్స్ ఆవిడ చెంతకు వచ్చింది.
Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా