Kalki 2 Update: ప్రభాస్ 'కల్కి 2' సంగతి ఏంటి? అప్డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్!

Kalki 2898 AD Producer Ashwini Dutt On Part 2: 'కల్కి 2898 ఏడీ' వసూళ్లతో సంబంధం లేకుండా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. పార్ట్ 2 గురించి ఆయన ఏం చెప్పారంటే?

Continues below advertisement

Kalki 2898 AD Movie Part 2 Update: 'కల్కి 2898 ఏడీ' విజయం చిత్ర బృందం అందరికీ ఎంతో ప్రత్యేకమైనది. పేరుతో పాటు భారీ వసూళ్లు వస్తుండటంతో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర నిర్మాత సి. అశ్వినీదత్ (C Aswani Dutt) సినిమాకు వస్తున్న వసూళ్లతో సంబంధం లేకుండా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలుగు మీడియాతో తెలిపారు. పార్ట్ 2 గురించి ఆయన ఒక అప్డేట్ ఇచ్చారు.

Continues below advertisement

ఆల్రెడీ 60 పర్సెంటేజ్ షూటింగ్ కంప్లీట్ చేశాం!
'కల్కి 2898 ఏడీ' కథ అనుకున్న సమయంలోనే రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నట్లు అశ్వినీదత్ తెలిపారు. యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్టులో భాగమైన తర్వాత రెండు భాగాలు తీయాలని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ అద్భుతమైన నటన కనబరిచారని అశ్వినీదత్ కొనియాడారు. ఆయన వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ పరిధి మరింత పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. 

60 percent of Kalki 2898 AD Part 2 shooting completed: ఒక్క సుప్రీమ్ యాస్కిన్ పాత్రకు కమల్ హాసన్ తప్ప మిగతా నటీనటులు అందరినీ ముందుగా అనుకున్నామని అశ్వినీదత్ తెలిపారు. కమల్ సైతం ఓ ఇంటర్వ్యూలో సుప్రీమ్ యాస్కిన్ పాత్రను ఓకే చేయడానికి ఆరు నెలల సమయం తీసుకున్నట్లు వివరించారు. ఇక, షూటింగ్ విషయానికి వస్తే... పార్ట్ 2 చిత్రీకరణ 60 శాతం పూర్తి అయ్యిందని అశ్వినీదత్ తెలిపారు. 

2025 వేసవి లేదా తొలకరిలో 'కల్కి 2' విడుదల!? 
Prabhas Kalki 2898 AD Part 2 Release: 'కల్కి 2898 ఏడీ'ని తొలుత మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ... కొన్ని కారణాల వాయిదా పడింది. జూన్ 27న విడుదల కాగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ బరిలో దూసుకు వెళుతోంది. అఖండ విజయం సాధించింది. 'కల్కి 2898 ఏడీ' పార్ట్ 2ను సైతం వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లేదా ఈ సమయానికి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అశ్వినీదత్ తెలిపారు.

Also Readటాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!


రెండు రోజుల్లో ఆల్మోస్ట్ 300 కోట్లు!
Kalki 2898 AD Box Office Collection: 'కల్కి 2898 ఏడీ'కి రెండు రోజుల్లో బాక్సాఫీస్ బరిలో రూ. 298.5 కోట్లు వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేసింది. వీకెండ్ టీ 20 ఫైనల్ ఉన్నప్పటికీ... రెబల్ స్టార్ మేనియా థియేటర్ల దగ్గర కనిపించింది. భారీ వసూళ్లు వచ్చాయి. రూ. 400 కోట్ల మార్కును నిన్నటితో చేరిందని తెలిసింది. టోటల్ కలెక్షన్స్ వెయ్యి కోట్లు చేరవచ్చని సమాచారం.

Also Read: బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!

Continues below advertisement
Sponsored Links by Taboola