Prabhas - Payal Rajput: సినీ పరిశ్రమలో ఒక రూమర్ వైరల్ అవ్వాలంటే ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా పాపులారిటీని సంపాదించుకున్న హీరోల విషయంలో రూమర్స్ అనేవి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇటీవల ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక అప్డేట్ వల్ల సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. అయితే అనూహ్యంగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన పోస్ట్ కూడా ప్రభాస్ చేసిన పోస్ట్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండడంతో నెటిజన్లలో ఆసక్తి మరింత పెరిగింది.


స్పెషల్ వ్యక్తి..


మే 17 ఉదయం ‘డార్లింగ్స్. ఫైనల్‌గా మన జీవితంలోకి ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని షేర్ చేశారు ప్రభాస్. దీంతో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని ప్రభాస్.. ఇలాంటి పోస్ట్ షేర్ చేశారేంటి అంటూ ఫ్యాన్స్ అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అయిపోయింది. ఫ్యాన్స్, నెటిజన్స్.. ఈ స్టోరీ చుట్టూ తమకు నచ్చిన కథను అల్లుకున్నారు. కానీ చాలామంది మాత్రం ఇది కచ్చితంగా మూవీ ప్రమోషన్ అనే ఫీలయ్యారు. ఇంతలోపు పాయల్ రాజ్‌పుత్.. తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది.






సినిమా కోసం..


‘నేను కచ్చితంగా ఒకరి డార్లింగ్‌నే. గెస్ చేయండి’ అంటూ ఒక పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్. దీంతో ప్రభాస్, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందేమో అని నెటిజన్లు స్టోరీలు క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. వీరిద్దరూ కలిసి ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నట్టుగా హింట్ ఇస్తున్నారంటూ ఫిక్స్ అయిపోయారు. మరికొందరు అయితే పాయల్ రాజ్‌పుత్‌తో ప్రభాస్ రిలేషన్‌లో ఉన్నాడా? వీరిద్దరికి పెళ్లి జరగనుందా? అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఫైనల్‌గా ఇవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో తను షేర్ చేసిన స్టోరీ.. ‘కల్కి 2898 AD' మూవీకి సంబంధించిందే అని సాయంత్రానికి క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.


ప్రభాస్ ఫ్యాన్..


‘కల్కి 2898 AD’లో హీరోయిన్ క్యారెక్టర్‌ను పరిచయం చేయడం కోసమే ఒక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేస్తానంటూ పోస్ట్ షేర్ చేశాడు ప్రభాస్. ఇంతలోనే పాయల్ రాజ్‌పుత్ కూడా దానికి రిలేట్ అయ్యే పోస్ట్ పెట్టడంతో నెటిజన్లంతా కన్‌ఫ్యూజ్ అయ్యారు. అయితే పాయల్‌కు ప్రభాస్ అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని బయటపెట్టింది. అంతే కాకుండా ప్రభాస్ మూవీ పోస్టర్లకు ముద్దుపెడుతున్న తన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. మొత్తానికి కాసేపటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టేసింది పాయల్ రాజ్‌పుత్.


Also Read: ఆ స్పెషల్‌‌ పర్సన్‌ ఎవరో చెప్పేసిన ప్రభాస్‌ - రేపే బుజ్జిని కలుసుకోబోతున్నానంటూ మరో‌ పోస్ట్‌