రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)కు, ఆయన అభిమానులకు బ్యాడ్ న్యూస్! నెటిజన్ ఎవరో వాళ్ళకు షాక్ ఇచ్చారు. అభిమానులు ముద్దుగా 'డార్లింగ్' అని పిలుచుకునే ప్రభాస్... సోషల్ మీడియాకు కొంచెం దూరం! ఆయనకు ట్విట్టర్ అకౌంట్ లేదు. ఫేస్ బుక్ ఉంది కానీ ఆ అకౌంటును వాడటం తక్కువ. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందులో ఆయన్ను కోటి మంది (పది మిలియన్ల మంది) ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆ అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.
అవును... ప్రభాస్ ఇన్‌స్టా హ్యాక్ అయ్యింది!
ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ప్రభాస్ అని సెర్చ్ చేయండి. అకౌంట్ ఏదీ కనిపించదు. ఫ్యాన్ మేడ్ అకౌంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒరిజినల్ & అఫీషియల్ అకౌంట్ మిస్ అయ్యింది. ప్రస్తుతం హ్యాక్ అయిన అకౌంటును వెనక్కి తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ప్రభాస్ టీమ్ ఉందని తెలిసింది.
యాంటీ ఫ్యాన్స్ హ్యాక్ చేశారా?
ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆ తేదీన షారుఖ్ ఖాన్ 'డంకీ' కూడా విడుదల అవుతోంది. రెండు సినిమాల మధ్య బలమైన పోటీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
Also Read : సాయి ధరమ్ తేజ్ మామూలుగా లేదు బ్రో... 'గాంజా శంకర్'గా మెగా మేనల్లుడు వచ్చేశాడోయ్!
ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు షారుఖ్. అయితే... ప్రభాస్ ఫ్లాప్ సినిమాల ఓపెనింగ్ రికార్డులను ఆ సినిమాలు అందుకోలేదని బాలీవుడ్ ఖబర్. ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి. నార్త్ ఇండియాలో షారుఖ్ ఫ్యాన్స్ చాలా మంది ప్రభాస్ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా హ్యాక్ చేశారా? లేదంటే మరొకరు చేశారా? అనేది చెప్పడం కష్టమే.
డిసెంబర్ 22న 'సలార్' వస్తుండటంతో షారుఖ్ ఖాన్ 'డంకీ' వాయిదా పడిందని శుక్రవారం ఉదయం ప్రచారం జరిగింది. అయితే... అటువంటిది ఏమీ లేదని ఆ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని అర్థం అయ్యింది.
Also Read : 48 ఏళ్ళ వయసులో కాలేజీ స్టూడెంట్‌గా సూర్య?
'సలార్' కాకుండా ప్రభాస్ చేస్తున్న సినిమాలకు వస్తే... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ మూవీ 'కల్కి 2989 ఏడీ' చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఓ ఫుల్ ఫన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇక, 'సలార్' రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే. హిందీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కూడా చర్చల్లో ఉంది. ఇంకా మరో రెండు మూడు సినిమాలు సైతం చర్చల దశలో ఉన్నాయి. 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇకపై చేయబోయే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial