‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’పైనే ఉన్నాయి. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నా కూడా ‘సలార్’ ప్రమోషన్స్ ప్రారంభించకపోవడంపై అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీంతో ‘సలార్’ టీమ్ ఒక సాంగ్ రిలీజ్ చేసి ఓదార్చింది.


ఐమ్యాక్స్ రిలీజ్ లేదు..
‘సలార్’ సినిమా గురించి మేకర్స్ అన్నింటికంటే ముందుగా ఇచ్చిన అప్డేట్ ఐమ్యాక్స్ రిలీజ్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐమ్యాక్స్ ఎఫెక్ట్స్‌తో రిలీజ్ అవుతుందని టీమ్ ప్రకటించింది. కానీ అంతలోనే అమెరికా వ్యాప్తంగా ‘సలార్’ ఐమ్యాక్స్ రిలీజ్ ఉండదని చెప్తూ.. ప్రభాస్ ఓవర్సీస్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు మేకర్స్. ఐమ్యాక్స్‌లో కాకుండా ‘సలార్’ను కేవలం ఎక్స్‌డీ లేదా పీఎల్‌ఎఫ్ స్క్రీన్స్‌పైనే చూడాలని ఒక అధికారిక ట్విటర్ అకౌంట్ ప్రకటించింది. దీంతో ఐమ్యాక్స్ స్క్రీన్స్‌పై ఈ సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు అనుకున్న ప్రేక్షకులు నిరాశపడ్డారు. స్క్రీనింగ్ విషయంలో ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్‌మెంట్ ఎదురైనా.. బుకింగ్స్ విషయంలో మాత్రం ‘సలార్’ క్రేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.


షారుఖ్ ఖాన్‌కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువ, కానీ..
ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డంకీ’తో థియేటర్లలో పోటీపడడానికి సిద్ధమయ్యింది. ‘డంకీ’ డిసెంబర్ 21న విడుదలకు సిద్ధమవ్వగా ఒకరోజు తర్వాత.. అంటే డిసెంబర్ 22న ‘సలార్’.. ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రెండు పెద్ద సినిమాలు, రెండూ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్నాయి కాబట్టి కలెక్షన్స్‌పై, బుకింగ్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని ప్రేక్షకులు అనుకున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికొస్తే.. ఓవర్సీస్‌లో ప్రభాస్‌కంటే షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్‌బేసే ఎక్కువ. దీంతో అసలు ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ఏంటో అని టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఎదురయ్యింది. పలు ఓవర్సీస్ మార్కెట్లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ‘డంకీ’ని మించిపోయాయట.


అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు..
యూఎస్, యూకే వంటి దేశాల్లో షారుఖ్ ఖాన్‌కు కల్ట్ ఫ్యాన్‌బేస్ ఉన్నా.. అక్కడ ‘సలార్’కే ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం యూఎస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ 750 వేల డాలర్లకు చేరుకుంది. ఇక యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో ‘సలార్’ అప్పుడే 120 వేల యూరోల మార్క్‌ను అందుకుంది. ‘సలార్’తో పోలిస్తే.. ‘డంకీ’ కాస్త తక్కువ బుకింగ్స్‌ను అందుకుందని సమాచారం. యూఎస్‌లో 185 వేల డాలర్లు, యూకేలో 70 వేల యూరోల అడ్వాన్స్ బుకింగ్స్‌ను అందుకోగలిగింది ‘డంకీ’. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ‘డంకీ’ కంటే ‘సలార్’ లీడ్‌లో ఉంది. కానీ గల్ఫ్, యూరోప్‌తో పాటు ఇతర దేశాల్లో ‘సలార్’ కాస్త వెనకబడినట్టు తెలుస్తోంది. ‘డంకీ’ ఒకరోజు ముందే విడుదల అవుతుండడంతో దాని ఫస్ట్ డే ఫస్ట్ షోకు వచ్చే టాక్.. ‘సలార్’పై మరింత ఎఫెక్ట్ చూపించనుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హిట్ బాటలో నడుస్తున్నాడు. ‘డంకీ’తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. మరోవైపు వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతోన్న ప్రభాస్‌కు ‘సలార్’ హిట్ చాలా ముఖ్యం. మరి, ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో.


Also Read: హ్యాపీ బర్త్‌ డే రానా - ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోవడం భల్లాలదేవుడికే సాధ్యం