తెలుగు తెరపై ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) అడుగుపెట్టి 23 ఏళ్ళు. ఆయన కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'ఈశ్వర్'. సరిగ్గా 23 ఏళ్ళ క్రితం ఇదే రోజు (నవంబర్ 11న) థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులకు 'ది రాజా సాబ్' (The Raja Saab) టీం ఒక గిఫ్ట్ ఇచ్చింది. తమ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది.
రాజా సాబ్ కొత్త పోస్టర్ చూశారా?చిత్రసీమలో ప్రభాస్ ప్రవేశించి 23 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా 'ది రాజా సాబ్' విడుదల చేసిన పోస్టర్ చూస్తే... సూపర్ స్టైలిష్‌గా ఉంది. ఆయన లుక్ అదిరింది. ఇటీవల యూరోప్‌లో రెండు పాటలు తీశారు. అందులో స్టిల్ అని అర్థం అవుతోంది.
Also Read: నెట్టింట నిహారిక వీడియో వైరల్... 'ఇరువురి భామల కౌగిలిలో' ఓపెనింగ్ - అసలు విషయం ఏమిటంటే?
నో డిలే... సంక్రాంతికి థియేటర్లలోకి!'ది రాజా సాబ్' సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు 'ప్రేమ కథా చిత్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హారర్ సినిమా తీసిన అనుభవం ఉంది. ఇక కామెడీ అంటారా? 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ తీశారు. దాంతో 'ది రాజా సాబ్' ఎలా తీశారో? ప్రభాస్ సీన్స్ ఎంత నవ్విస్తాయో? అని అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు.
Also Read: బికినీలో బాలీవుడ్ భామ... తెలుగులో నానితో సినిమా చేసింది... ఎవరో గుర్తు పట్టారా?
సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది (2026) పెద్ద పండక్కి థియేటర్లలో సినిమా సందడి చేయనుంది. అయితే ఇటీవల సినిమా విడుదల వాయిదా పడుతుందని కొన్ని పుకార్లు వినిపించాయి. వాటికి చిత్ర బృందం చెక్ పెట్టింది. పండక్కి సినిమా వస్తుందని పేర్కొంది. మరోసారి రిలీజ్ డేట్ పోస్టర్ మీద కన్ఫర్మ్ చేసింది.
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన 'ది రాజా సాబ్' సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది.