Prabhas  Salaar Salary: ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ కనీవిని ఎరుగని స్థాయికి చేరుకుంది. ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా మార్కెట్ ను పెంచుకున్నారు రెబల్ స్టార్. ‘బాహుమలి‘ తర్వాత ఆయన వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. అయితే, ‘బాహుబలి‘ తర్వాత వచ్చిన ‘సాహో, రాధేశ్యామ్’, ‘ఆది పురుష్’ భారీ అంచనాల నడుమ విడుదలైనా, అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. రీసెంట్ గా ‘కేజీఎఫ్’ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిసెంబర్ 22, 2023న విడుదలైన ఈ సినిమా ఓ రేంజిలో విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ. 700 కోట్ల మేర వసూళ్లు సాధించింది.


సెకనుకు రూ.80 లక్షల పారితోషకం


గత కొద్ది కాలం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ప్రభాస్. ‘ఆదిపురుష్’ లో కూడా, శ్రీరాముడి పాత్రను పోషించినందుకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారు. ‘సలార్‘ సినిమాకు కూడా ఆయన రూ. 100 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ మూవీ బాక్సాఫీస్ లాభాల్లో 10% అదనంగా తీసుకున్నరట. అయితే, సలార్‌లో డైలాగుల ఆధారంగా.. ప్రభాస్‌కు ఎంత ముట్టి ఉండవచ్చనే అంచనాలతో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ రిపోర్టుల ప్రకారం..


‘సలార్‘ సినిమా మొత్తం నిడివి 2 గంటల 55 నిమిషాలు ఉంది. ఈ మొత్తం రన్ టైమ్ లో ప్రభాస్ కేవలం 2 నిమిషాల 35 సెకన్ల డైలాగులే ఉన్నాయి. అంటే, ఈ సినిమా కోసం ఆయన రూ.125 కోట్లు తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే, రూ.125 కోట్లను 2 నిమిషాల 35 సెకన్లతో భాగించినట్లయితే, అతడి ప్రతి సెకెన్ డైలాగ్ కు రూ. 80,64,516 ఛార్జ్ చేశారు. భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన ఒకే ఒక్క హీరో ప్రభాస్ కావడం విశేషం.


ప్రశాంత్ నీల్ ‘సలార్‘ సినిమాను మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్ జర్నలిస్టు పాత్రలో కనిపించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు. రవి బాస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషించారు. 'సలార్' పార్ట్ -1  ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల అయ్యింది.






‘కల్కి 2898 ఏడీ‘ సినిమాలో ప్రభాస్


ప్రస్తుతం ప్రభాస్ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ‘కల్కి 2898 ఏడీ‘ సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది. పురాణాల్లోని ఆయుధాలకు లేటెస్ట్ టెక్నాలీజ తోడైతే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు నాగ్ అశ్విన్. అటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.


Read Also: ‘భామాకలాపం 2’ టీజర్ వచ్చేసింది, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ - థియేటర్లలో కాదండోయ్!