Prabhas about Gaami Trailer: 'గామి' విశ్వక్‌సేన్ నటించిన ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. కారణం.. సినిమా కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్. 'గామి' టీజర్ రిలీజైనప్పటి నుంచే ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక గురువారం ట్రైలర్ రిలీజైన తర్వాత ఆ అంచనాలు డబుల్ అయ్యాయనే చెప్పాలి. 'గామి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది సినిమా టీమ్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారట. 'గామి' ట్రైలర్ చూసిన ఆయన ఇలా రియాక్ట్ అయ్యారు.
చాలా బాగుంది..
తనకు నచ్చిన సినిమా, నచ్చిన అంశం ఉంటే ఎంత బిజీగా ఉన్నా దాన్ని అభిమానులతో పంచుకుంటారు ప్రభాస్. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. 'గామి' ట్రైలర్ చూసిన డార్లింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకు ట్రైలర్ తెగ నచ్చేసిందని చెప్పారు. "విక్కి టీజర్ చూపించాడు. చాలా నచ్చింది. ట్రైలర్ కూడా చూపించమని అడిగాను. చూశాక ఇంకా ఎగ్జైట్ అయ్యాను. విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తుంటాడు. ప్రతి డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడింది. ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మార్చి 8 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ డైరెక్టర్, ఫుల్ టీమ్, యాక్టర్స్, విశ్వక్‌సేన్ ఆల్ ది బెస్ట్. హార్డ్ వర్క్ కనిపిస్తుంది. బిగ్ బిగ్ బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్‌కి కూడా ఆల్ ది బెస్ట్" అని అన్నారు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'కల్కీ' షూటింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం.
ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్..
'గామి' ఫస్ట్ లుక్, టీజర్ చూసినప్పుడు ఆ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. విశ్వక్‌సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనుండటంతో సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. అయితే, ట్రైలర్ రిలీజైన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా పెరిగిందనే చెప్పాలి. అంతబాగా తెరకెక్కించారు సినిమాని. హిమాలయాలు, మంజు పర్వాతాలు 36 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన రోజు.. ప్రతి కాన్సెప్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
‘గామి’లో విశ్వక్ సేన్‌కు జోడీగా చాందినీ చౌదరి నటించింది. వీరితో పాటు ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విద్యాధర్.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మొదటి సినిమానే చాలా డిఫరెంట్‌గా తెరకెక్కిస్తున్నాడు అంటూ ఆయనపైన కూడా ప్రశంసలు వచ్చాయి. కాగా.. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: కేరళలోనే కాదు.. ఆ రాష్ట్రంలోనూ దుమ్ములేపుతున్న 'మంజుమ్మెల్ బాయ్స్'