Poonam Dhillon On Arshad Warsi's Joker Comments: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మీద బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అభ్యంతర వ్యాఖ్యలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ‘కల్కి 2898 ఏడీ‘ మూవీలో ప్రభాస్ ను జోకర్ గా మార్చారని ఆయన వ్యాఖ్యానించడాన్ని పలువు సినీతారలు తప్పుబట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సమంజసం కాదన్నారు. ఈ నేపథ్యంలోనే అర్షద్ వార్సీ కామెంట్స్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) ప్రెసిడెంట్ మంచు విష్ణు రీసెంట్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభాస్‌పై అర్షద్ వ్యాఖ్యలు తెలుగు సినీ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని వెల్లడించారు. ఈ మేరకు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు ఆయన లేఖ రాశారు. మరోసారి ఇలాంటి కామెంట్స్ పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
మంచు విష్ణు లేఖపై స్పందించిన పూనమ్ ధిల్లాన్
మంచు విష్ణు లేఖపై సీఐఎన్‌టీఏఏ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ స్పందించారు. ప్రభాస్ పై అర్షద్ వ్యక్తిగతంగా కామెంట్ చేశాడని భావించడం లేదని చెప్పారు. కేవలం ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఆయన పాత్రను ఉద్దేశించి ఉండొచ్చని చెప్పారు. “బాలీవుడ్ నటుడు అర్షద్ చేసిన కామెంట్స్, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఉంటాయని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా ప్రభాస్ ను కామెంట్ చేశారని అనుకోను. ఈ వ్యాఖ్యలు నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలోని చాలా మందిలో కొంత అసహనం కలిగించి ఉంటాయి. సినిమా పరిశ్రమలో అందరూ ఐక్యంగా ఉండాలి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకూడదు. టాలీవుడ్ కు ఇబ్బందికరంగా మారిన అర్షద్ వ్యాఖ్యలను మరోసారి రిపీట్ కాకుండా చూసేలా ప్రయత్నం చేస్తాం. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. ప్రభాస్ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు. అలాంటి వ్యక్తి పట్ల అర్షద్ ఇబ్బంది పెట్టే కామెంట్స్ చేస్తారని నేను నమ్మడం లేదు. అయినా, అర్షద్ నుంచి ఏం జరిగిందో తెలుసుకుంటాం” అని పూనమ్ వెల్లడించారు.
అర్షద్ వార్సీ ఏమన్నారంటే?
రీసెంట్ గా ఓ టీవీ షోలో పాల్గొన్న అర్షద్ వార్సీ, తనకు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పెద్దగా నచ్చలేదని చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ ను చూపించిన విధానంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో అతడిని ఓ జోకర్ లా చూపించారన్నారు. మేకర్స్ ఆయనను ఎందుకు అలా చూపించారో అర్థం కావట్లేదన్నారు. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ పాత్రపై అర్షద్ ప్రశంసలు కురిపించారు. ఆయన క్యారెక్టర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడించారు. అర్షద్ వార్సీ కామెంట్స్ పై తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నాని, సుధీర్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, అజయ్ భూపతి తీవ్రంగా స్పందించారు.
Read Also: ప్రభాస్ పై అర్షద్ వార్సీ కామెంట్స్... CINTAA అధ్యక్షురాలికి మంచు విష్ణు లేఖ
Read Also: జోకర్ కాదు, సక్సెస్ వెనుక స్ట్రాంగ్ పిల్లర్ - అర్షద్ వార్సీ కామెంట్స్‌పై డీజే టిల్లు ఫైర్