Pooja Hegde: పూజా హెగ్డే... మోస్ట్ వాంటెడ్ హీరోయిన్! ఇప్పుడు ఆమె చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. మరో ఏడాది వరకు పూజా హెగ్డే డైరీ ఫుల్. కొత్త సినిమాల గురించి ఆలోచించే తీరిక, విడుదలైన సినిమాల ఫలితాల గురించి విచారించే సమయంలో ఆమె దగ్గర లేవు. ఒక సినిమా తర్వాత మరొక సినిమా... షూటింగ్ స్టార్ట్ చేయడానికి పూజ రెడీ అవుతున్నారు.

Continues below advertisement


కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం పూజా హెగ్డేకు లభించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ భాయ్ లేటెస్ట్ సినిమా 'కభీ ఈద్ కభీ దివాలి'. మే 12వ తేదీన ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ కానుంది. అందులో పూజా హెగ్డే జాయిన్ కానున్నారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలిసింది.



తెలుగులో పూజ హెగ్డే నటించిన లాస్ట్ రెండు సినిమాలు 'రాధే శ్యామ్', 'ఆచార్య' విజయాలు సాధించలేదు. అయితే... ఆమె కెరీర్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. హిందీలో 'కభీ ఈద్ కభీ దివాలి'తో పాటు ర‌ణ్‌వీర్‌ సింగ్ సరసన 'సర్కస్' సినిమా చేస్తున్నారు. 


Also Read: ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర, అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?


తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రానున్న హ్యాట్రిక్ సినిమా (SSMB 28) లో పూజా హెగ్డే కథానాయిక. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమా 'భవదీయుడు భగత్ సింగ్' (Bhavadeeyudu Bhagat Singh) లో కూడా ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కథానాయకుడు కాకుండా 'ఎఫ్ 3' సినిమాలో ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేయనున్నారు.


Also Read: 'మహేష్ ఫ్యాన్స్ కు ఇదొక ట్రీట్' - 'సర్కారు వారి పాట' సినిమాపై కీర్తి కామెంట్