police report against Manjummel Boys producers: మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఈ సినిమా హిట్ టాక్ అందుకున్న దగ్గర నుంచి ఏదో ఒక చిక్కుల్లో పడుతూనే ఉంది. ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూసర్లపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే, ఆ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేశారు పోలీసులు. దానికి సంబంధించి రిపోర్ట్ ను కోర్టులో సబ్మిట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రొడ్యూసర్లు మోసం చేసినట్లు రిపోర్ట్ లో వెల్లడించారు పోలీసులు.
కేసు ఏంటంటే?
ఆరూర్‌కు చెందిన పిటీషనర్ సిరాజ్ వలియతర ‘మంజుమ్మెల్ బాయ్స్’ ప్రొడ్యూసర్లపై కేసు ఫైల్ చేశారు. పరావా ఫిలిమ్స్, షాన్ ఆంటోనీ కలిసి ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాకు వచ్చే లాభాల్లో 40 శాతం షేర్ ఇస్తానని సిరాజ్ వలియతరకు మాటిచ్చారు. దానికిగాను ఆయన రూ.7 కోట్లు సినిమాలో పెట్టుబడి పెట్టాడు. అయితే, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత వాటా ఇవ్వకుండా మోసం చేశారని, తను పెట్టుబడిగా పెట్టిన ఏడు కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పరావా ఫిల్మ్స్, షాన్ ఆంటోనీ మీద సిరాజ్ కోర్టులో కేసు వేశారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు పరావాఫిలిమ్స్, షాన్ ఆంటోని అకౌంట్లు ఫ్రీజ్ చేసింది. దీనిపై వాళ్లు హైకోర్టులకు వెళ్లగా వాళ్లను అరెస్ట్ చేయొద్దని, ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించింది కోర్టు.
పోలీసులు ఏమన్నారంటే?
హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన పోలీసులు దానికి సంబంధించిన రిపోర్ట్ ను కోర్టుకు అందించారు. దాంట్లో అన్ని వివరాలు వెల్లడించారు. పరావా ఫిలిమ్స్, షాన్ ఆంటోని ఇద్దరు కలిసి ఉద్దేశపూర్వకంగానే సిరాజ్ ను మోసం చేసినట్లు చెప్పారు. సినిమాకి రూ.18.2 కోట్లు ఖర్చు చేసి, రూ.22కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపించారని అన్నారు. సిరాజ్‌కు ఇస్తామన్న డబ్బులు కూడా వాళ్లు ఇవ్వలేదని పోలీసులు రిపోర్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా మొదలవ్వకముందే ఒక షెడ్యూల్ కూడా పూర్తైపోయిందని అబద్ధాలు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు లీగల్ నోటీసులు..
‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా కోర్టు చుట్టూ తిరుగుతోంది. ప్రొడ్యూసర్లపై ఛీటింగ్ కేసు కొలిక్కి రాకముందే, మరోవైపు కాపిరైట్స్ కేసు నోటీసులు పంపారు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. తన కంపోజ్ చేసిన సూపర్ హిట్ పాటను సినిమాలో వాడుకున్నారని ఆరోపించారు. తన పర్మిషన్ లేకుండా వాడుకున్నారంటూ లీగల్ నోటీసులు పంపారు ఆయన. ఇక ఇప్పుడు ఈ కేసు కూడా వచ్చి నెత్తిన పడినట్లు అయ్యింది.
చిన్న సినిమాగా రిలీజై రికార్డులు సృష్టించింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి సినిమాకి. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ పరంబోల్ లీడ్ రోల్స్‌లో నటించారు. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’లో శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ పరంబోల్ లీడ్ రోల్స్‌లో నటించారు.
Also Read: అందరినీ మిస్ అవుతాను.. ఇంద్రజ ఎమోషనల్ పోస్ట్ - ‘జబర్దస్త్’కు వీడ్కోలు