స్టార్‌ కొరియోగ్రాఫర్‌ జానీను ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఆచూకీని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక బృందాలు ఆయన ఉండే ప్రాంతానికి వెళ్లాయి. అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. మహిళపై వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న జానీ మాస్టర్ ఆచూకీని పోలీసులు పసిగట్టేశారు. ప్రస్తుతం ఆయన లడఖ్‌లోని ఓ ఏరియాలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమచారంతోనే పోలీసులు ఆయన్ని చుట్టుముట్టారని అంటున్నారు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది. జానీ మాస్టార్ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 


పరారీలో జానీ మాస్టర్‌


మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారని ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటి వరకు 21 ఏళ్ల అమ్మాయిపైనే అత్యాచారం చేశారని అనుకున్నారు. అయితే తాను మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం చేశారని చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసులు బుక్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువతి, ఢీ కంటెస్టెంట్‌ జానీ మాస్టర్‌పై ఇటీవల హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఎవరికీ అందుబాటులో లేడని సమచారం. ఫోన్‌లో కూడా ఎవరితో మాట్లాడటం లేదని తెలుస్తోంది. ఆయన ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. 


కనిపెట్టిన పోలీసులు - త్వరలో అరెస్ట్‌


ఆయన కోసం గాలించిన పోలీసులు జానీ ఏపీలోని నెల్లూరులో ఓ గ్రామంలో ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. దీంతో జానీకి నోటీసులు ఇచ్చిన అతడి అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక ఏ క్షణమైన జానీ మాస్టర్‌ పోలీసులు అరెస్ట్‌  చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా జానీ మాస్టర్‌ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం కలకలం రేపుతుంది. జనసేన పార్టీలో కీలక పదవిలో ఉన్న జానీ ఇటీవల ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిగానే పని చేశాడు. పవన్ కల్యాణ్ విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 



Also Reda: మూవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ - రూ. 99కే మల్టీప్లెక్స్‌లో సినిమా - బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్



డ్యాన్స్‌ అసోసియేషన్‌‌ బహిష్కరణ


అయితే జానీపై ఆరోపణలు వచ్చిన వెంటనే జనసేన పార్టీ అతడిపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అటు ఇండస్ట్రీలోనూ జానీకి తీవ్ర తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  అతడిపై వస్తున్న ఆరోపణలు నిజమని తెలుగు ఫిలిం ఛాంబర్‌ కమిటీ కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఉన్న తెలుగు ఫిలిం డ్యాన్స్‌ అండ్‌ టీవీ డ్యాన్స్‌ అసోసియేషన్‌ కూడా చర్యలు తీసుకుంది. అతడిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి. అంతేకాదు డ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా జానీపై ఆగ్రహంతో ఉన్నారట. దీంతో జానీ డ్యాన్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్స్‌ రావడంతో ఆయనను బహిష్కరించినట్టు తెలుస్తోంది. అలాగే డ్యాన్స్ అసోసియేషన్‌ సభ్యులు కూడా జానీతో మాట్లాడొద్దని, కాంటాక్ట్‌ కూడా అవ్వోద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 


Also Read: జానీ మాస్టర్‌కి మరో షాక్, అతడిపై పోక్సో కేసు నమోదు - డ్యాన్స్‌‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం!