రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన సినిమా 'పెద్ది' (Peddi Movie). జూన్ 3న రాత్రి నుంచి ప్రీమియర్లు. దుబాయ్ సెన్సార్, ఇండియన్ సెన్సార్ నుంచి కాస్త నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే తమిళ్ సెన్సార్ నుంచి సూపర్బ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కల్ట్ క్లాసిక్ లోడింగ్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది తమిళ్ సినిమా. 'పెద్ది' తమిళ్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి.
నెక్స్ట్ లెవల్ స్క్రిప్ట్... రామ్ చరణ్ బెస్ట్!పవర్ ఫుల్ క్యారెక్టర్స్, స్ట్రాంగ్ ఎమోషనల్ డెప్త్, థియేటర్లలో ప్రేక్షకులు అందరికీ గుర్తుండే విధంగా దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ లెవల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ సినిమా హైలెట్స్‌లో స్టోరీ కూడా ఉంటుందని తమిళ్ సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్.
- కథ కంటే ముందు 'పెద్ది' సినిమాకు మెయిన్ హైలైట్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అని మరో టాక్. 'పెద్ది'గా రామ్ చరణ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని సమాచారం. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎమోషనల్ సీన్స్ గురించి తెలుగు సెన్సార్ అండ్ సినిమా టీమ్ నుంచి సూపర్బ్ టాక్ వచ్చింది. తమిళ్ సెన్సార్ నుంచి కూడా సేమ్ రిపోర్ట్ వచ్చింది.
- 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటించారు. ఆమెతో హీరో లవ్ ట్రాక్, ఆ సన్నివేశాలు సినిమాకు కొత్తదనాన్ని ఇచ్చాయట. అలాగే జగపతి బాబు పాత్ర సైతం చాలా శక్తివంతంగా ఉంటుందని తెలుస్తోంది.
- ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి తమిళ్ సెన్సార్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆస్కార్ విజేత అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళిందట. వృద్ధి సినిమాస్ ఖర్చుకు అసలు ఏమాత్రం వెనుకంజ వేయలేదని, భారీగా సినిమాను తీశారని, స్క్రీన్ మీద ఆ లావిష్‌నెస్ కనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద కల్ట్ క్లాసిక్ లోడింగ్ అంటున్నారు.
Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేయడం వల్ల తమిళంలో ఆ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. అయితే... ఆశించిన రీతిలో ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు 'పెద్ది' ప్రచార చిత్రాల్లో నేటివిటీ కనిపించడం, పల్లెటూరి కథ కావడంతో తమిళ ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరి, అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
