Payal Rajput Mangalavaaram : సినీ తారల జీవితం మారిపోవడానికి ఒక్క సినిమా చాలు.. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒకే సినిమా వారి జీవితాన్ని మార్చేయగలదు. అదే విధంగా ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కెరీర్ కూడా ‘ఆర్ఎక్స్ 100’ అనే ఒక్క సినిమాతో కొత్త మలుపు తీసుకుంది. ఒక్క సినిమాతో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామకు మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ పడలేదు. దాని తర్వాత తను నటించిన ఈ సినిమా కూడా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీంతో ఇన్నేళ్ల తర్వాత తనకు ‘ఆర్ఎక్స్ 100’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే కలిసి పనిచేస్తోంది పాయల్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మంగళవారం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండడంతో ఈ సినిమా విశేషాలను ప్రేక్షకులను పంచుకుంది బోల్డ్ బ్యూటీ.


వెంటనే ఓకే చెప్పేశాను


‘ఆర్ఎక్స్ 100’ అనేది పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో మొదటి సినమానే అయినా.. అందులోనే తాను బోల్డ్ సీన్స‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అదే దర్శకుడితో చేస్తున్న సినిమా కాబట్టి ‘మంగళవారం’లో కూడా బోల్డ్ సీన్స్ ఉంటాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే కేవలం బోల్డ్ సీన్స్ కోసమే తనను హీరోయిన్‌గా తీసుకున్నారా అనే ప్రశ్న పాయల్‌కు ఎదురయ్యింది. ‘‘అజయ్ సార్ ఫోన్ చేయగానే నా తరపున ఎస్ అని అనుకున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఆయనతో మళ్లీ కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను. అందుకే నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. ఇది రొటీన్ సినిమా కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమాను అని అనుకున్నాను’’ అని పాయల్ చెప్పుకొచ్చింది.


బోల్డ్‌నెస్ అంటే అదే


‘మంగళవారం’ ట్రైలర్‌లో ఉన్న బోల్డ్ సీన్స్‌పై కూడా పాయల్ రాజ్‌పుత్ స్పందించింది. ‘‘నేను ఒక నటిని. నేను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాను. అది ఏదైనా కూడా నేను మనస్ఫూర్తిగానే చేశాను. సౌకర్యంగా లేకపోయినా చేయడమే నా పని. అందుకే చేశాను’’ అని సమాధానమిచ్చింది. అంతే కాకుండా బోల్డ్‌నెస్ గురించి కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ‘‘బోల్డ్‌నెస్ అనేది అందరికీ ఒకేలా అర్థం కాదు. మీ ఆలోచనతో పోలిస్తే నా ఆలోచన కొంచెం వేరేలాగా ఉండవచ్చు. నా దృష్టిలో బోల్డ్‌నెస్ అనేది కథ ప్రకారం జరిగేదే. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ అనేది జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశంలాగా భావిస్తున్నారు. ప్రతీ యాక్టర్ జీవితంలో ఇలాంటి అవకాశం ఒకేసారి వస్తుంది. నాకు అలాంటి అవకాశం దొరికింది. అందుకే నేను వెంటనే ఎస్ చెప్పాను’’ అని పాయల్ తెలిపింది.


నన్ను సీరియస్‌గా తీసుకోవాలి


హీరోయిన్‌గా అడుగుపెట్టిన ప్రతీ నటికి ఎన్నో కలలు ఉంటాయి. ఎన్నో హిట్స్ సాధించినా కూడా ఇంకా ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటారు. పాయల్‌కు కూడా అలాంటి కలలు ఉన్నాయని బయటపెట్టింది. తనకు ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలతో నటించాలని ఉందని తెలిపింది. అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలతో నటించాలని ఉందని, వారు తనను సీరియస్‌గా తీసుకునేలా చేయాలని అనుకుంటున్నానని బయటపెట్టింది. మార్వెల్ లాంటి క్యారెక్టర్ చేస్తారా అని అడగగా.. ‘మంగళవారం’ సినిమాలో ఆల్రెడీ తనకు సూపర్ పవర్స్ ఉన్నాయని.. సినిమాలోని ఒక మెయిన్ సస్పెన్స్‌ను బయటపెట్టింది పాయల్ రాజ్‌పుత్.


Also Read: తండ్రి వర్థంతి సందర్భంగా మహేష్ కీలక నిర్ణయం, వారికి చేయుత?