అన్నా లెజినోవా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భార్య. తనది మన దేశం కాదు. మన సంప్రదాయాలు తెలియవు. విదేశీ అమ్మాయి. అయితేనేం.. తోటి వారితో ఎలా మసులుకోవాలో తెలిస్తే సరిపోతుంది. తాజాగా అన్నా లెజినోవా చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఎంత గొప్పదో చెప్పేందుకు ఈ ఒక్క ఘటన చాలంటున్నారు. అసలు ఏం జరిగిందంటే?


పవర్ స్టార్ చెప్పులు చేతితో తీసుకుని పట్టుకున్నలెజినోవా


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన తర్వాత పవన్ కల్యాణ్.. అన్నయ్య మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అక్కడ తనకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ్ముడి విజయాన్ని చూసి అన్నయ్యలు చిరంజీవి, నాగబాబు ఉప్పొంగిపోయారు. పెద్ద అన్నయ్య చిరంజీవి కనిపించగానే, వెంటనే తన కాళ్లకున్న చెప్పులు విడిచి మోకాళ్ల మీద కూర్చొని కాళ్లకు నమస్కరించారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన సతీమణి అన్నా లెజినోవా కూడా బావగారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత తన తల్లి, వదినకు నమస్కరించే సమయంలోనూ ఆయన చెప్పులు విడిచారు. భర్త చెప్పుల్ని లెజినోవో తన చేతులతో తీసుకుని పక్కన నిలబడ్డారు.


అన్నా లెజినోవాపై నెటిజన్ల ప్రశంసలు


విదేశీ వనిత అయినప్పటికీ తన భర్త చెప్పులను తీసుకొని పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అన్నా లెజినోవా గొప్పదనానికి ఈ ఒక్క ఘటన నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. అంత మంచి అమ్మాయి కాబట్టే పవన్ ఆమెను భార్యగా చేసుకున్నారని కామెంట్స్ పెడుతున్నారు. రష్యా అమ్మాయి అయినా, ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం గొప్పవిషయం అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా లెజినోవా పని తీరు చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



ఎన్నికల్లో విజయం తర్వాత బయటకు వచ్చిన అన్నా లెజినోవా


వాస్తవానికి పవర్ స్టార్ భార్య అన్నా లెజినోవా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తారు. ఎక్కువగా బయటకు రారు. పబ్లిక్ ప్లేస్ లోకి తక్కువగా వస్తారు. ఫోటోలు, వీడియోలు కూడా ఎక్కువగా కనిపించరు. అయితే, ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇంటి వచ్చిన పవర్ స్టార్ కు భార్య లెజినోవాతో మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఇంటి దగ్గరికి వచ్చిన అభిమానులకు అభివాదం చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత పవన్ ఢిల్లీ పర్యటనలో కూడా  ఆమె ఉన్నారు. ప్రధాని మోడీతో సమావేశంలోనూ తను పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేరుగా అన్నా లెజినోవాతో కలిసి పవర్ స్టార్ మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికి సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాగబాబు సహా కుటుంబ సభ్యులు సంతోషంలో ఆనంద భాష్పాలు రాల్చారు. విజయగర్వంలో మునిగిపోయారు.   


Read Also : యాక్షన్ మూవీస్ ఇష్టమా ? Netflix లో దుమ్ము రేపుతోన్న ఈ బెస్ట్ 10 సినిమాలు చూసేయండి