Pawan Kalyan OG Movie Premier Show In AP: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' సంబరాలు స్టార్ట్ అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరల పెంపు సహా బెనిఫిట్, ప్రీమియర్ షోలకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో 24న రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్ షో వేసేందకు అనుమతి ఇచ్చారు. అయితే, ఏపీలో రాత్రి 1 గంటకు షో వేయనుండడం ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించింది.
ఏపీలోనూ ప్రీమియర్ షో
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సైతం పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 24న రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్స్‌కు అనుమతి ఇచ్చింది. టికెట్ ధర రూ.1000గా నిర్ణయించింది. అటు బెనిఫిట్ షోలకు సైతం టికెట్ ధర వెయ్యి రూపాయలుగానే ఉంది. తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు.
ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకూ ఫస్ట్ 10 డేస్ పాటు ఏపీలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.125, మల్టీ ఫ్లెక్సుల్లో జీఎస్టీతో కలిపి రూ.150 పెంచేందుకు అనుమతి ఇచ్చారు. అటు, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.100, మల్టీ ఫ్లెక్స్‌ల్లో రూ.150 వరకూ పెంచుకునేందుకు అనుమతి లభించింది.
Also Read: 'కల్కి' సీక్వెల్... దీపికా ప్లేస్‌లో ఎవరు? - డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్ల ఒపీనియన్ ఏంటో తెలుసా?
థియేటర్ల వద్ద రచ్చ రచ్చే
'OG' రిలీజ్ అవుతున్న థియేటర్స్ వద్ద రచ్చ లేపేందుకు ఫ్యాన్స్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. పలు థియేటర్ల వద్ద ఫస్ట్ టికెట్స్ స్పెషల్‌గా పవన్ ఫ్యాన్స్ వేలం వేస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శ్రీనివాసా థియేటర్ వద్ద ఫస్ట్ టికెట్‌ను లక్కారం గ్రామానికి చెందిన ఓ అభిమాని రూ.1,29,999 కు వేలంలో దక్కించుకున్నాడు. ఈ డబ్బులను జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ఫ్యాన్స్ చెప్పారు. ఇక ఏపీలోని చిత్తూరులో ఓ అభిమాని 'OG' టికెట్‌ను లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన ఆఫీసుకు పంపించనున్నట్లు చెప్పారు.
పవన్ గ్రేస్ సిల్వర్ స్క్రీన్‌పై...
పవర్ ఫుల్ వెపన్స్‌తో పవర్ స్టార్ గ్రేస్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా? అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, లుక్స్, తమన్ బీజీఎం, మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ డ్రామాలో రియల్ పవర్‌ను చూస్తామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమేనంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకా 2 రోజులే ఉండడంతో థియేటర్లలో ఎలా పవర్ ఫుల్ మూమెంట్స్‌ను ఎలా సెలబ్రేట్ చెయ్యాలో అంటూ ప్లాన్ చేస్తున్నారు.
మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. సత్య దాదాగా ప్రకాష్ రాజ్, అర్జున్‌గా అర్జున్ దాస్, గీతగా శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహించగా... డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు.