Netizens Opinion About Kalki 2898 AD Sequel Actress: ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికాను సడన్‌గా తప్పించడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో 'సుమతి'గా కీలక రోల్ పోషించిన ఆమె స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారనేది ఇప్పుడు మిలియన్ మార్కుల ప్రశ్నగా మారింది. దీనిపై గత 2 రోజులుగా సోషల్ మీడియాలోనూ మీమ్స్, జోకులు, సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. 

అసలు ఒపీనియన్ ఏంటంటే?

ఫస్ట్ పార్ట్‌లో దీపికా చాలా బాగా నటించారని... 'సుమతి' క్యారెక్టర్‌లో లీనమై ఆ పాత్రకు జీవం పోశారంటూ అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు దీపికా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సడన్‌గా ఆమెను మూవీ నుంచి తప్పించడంతో ఆ ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మూవీ టీం కూడా హీరోయిన్‌పై సెర్చింగ్ మొదలు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది.

'కల్కి' సీక్వెల్‌లో దీపికా స్థానాన్ని భర్తి చేసేది స్వీటీ అనుష్క మాత్రమేనంటూ ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, అనుష్క జోడీ బాగుంటుందని... 'బాహుబలి'లో వీరిద్దరి జంట అదిరిపోయిందని అంటున్నారు. ఆ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి మూవీ చేయలేదు. ఇద్దరూ కలిసి మళ్లీ నటిస్తే బాగుంటుందని చెబుతున్నారు. బాహుబలిలో అనుష్క గర్భంతో ఉన్న సీన్‌తో 'కల్కి'లో కూడా దీపికా గర్భంతో ఉన్న సీన్‌ను కంపేర్ చేస్తున్నారు.

మరికొందరు రీసెంట్‌గా 'కొత్త లోక' మూవీలో పవర్ ఫుల్ యోధురాలిగా నటించిన కల్యాణి ప్రియదర్శన్ అయితే బాగుంటుందంటూ కామెంట్ చేస్తున్నారు. రెండింటికీ సైన్స్ ఫిక్షన్ పోలికలు ఉండడంతో ఈ జోడీ కూడా బాగానే ఉంటుందంటూ చెబుతున్నారు. ఇంకొందరు కీర్తి సురేష్‌ను పెడితే పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా... బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎవరినో ఎంపిక చేస్తే బాగుంటుందని కొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఎవరైతే ప్రభాస్‌కు, 'కల్కి'  సీక్వెల్ స్టోరీకి పర్ఫెక్ట్ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావిస్తారో తెలియాల్సి ఉంది. ఈ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: టైటిల్‌తో ఆడియన్స్‌ కంట్లో పడ్డారు... ఇట్లు మీ ఎదవ - చదివింది నిజమే!

అసలు రీజన్ ఏంటి?

ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాను తప్పించడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. వర్కింగ్ అవర్స్ కండీషన్స్, రెమ్యునరేషన్, పలు ఫెసిలిటీస్ డిమాండ్ కారణాలతో ప్రొడ్యూసర్ ఆమెను తప్పించారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై నెట్టింట డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం రియాక్ట్ అయ్యారు. జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరని... కానీ తర్వాత ఏం జరగాలో మీరు మార్చుకోవచ్చని చెప్పగా ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. త్వరలోనే కొత్త హీరోయిన్‌ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది.

సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు? 

2024లో వచ్చిన 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక నాగ్ అశ్విన్ తలైవాతో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత 'కల్కి 2' ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది.