పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా 'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆఖరి నెలలో... డిసెంబర్ 4న అధికారికంగా ప్రకటించారు కూడా! ఆ సినిమా ఓపెనింగుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
జనవరి 30న...
హైదరాబాద్‌లో!
జనవరి 30న... అనగా సోమవారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా ఓపెనింగ్ జరగనుంది. పూజా కార్యక్రమాలతో ఆ రోజు లాంఛనంగా సినిమాను ప్రారంభించనున్నారు. ఆల్రెడీ పూజకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఓపెనింగ్ రోజున ఎప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేదీ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.
'ఆర్ఆర్ఆర్' తర్వాత...
డీవీవీ నుంచి వస్తున్న!
ప్రపంచ ప్రేక్షకులు అందరూ తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రమిది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం. ఇది రీమేక్ సినిమా కాదని... పవన్ కోసం సుజిత్ రాసిన స్ట్రెయిట్ కథతో వస్తున్న సినిమా.
హీరో గ్యాంగ్‌స్టర్ కా బాప్...
పవన్ కళ్యాణ్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నారు సుజీత్. సినిమాలో హీరోది డాన్ రోల్. తొలుత సినిమా అనౌన్స్ చేసినప్పుడు పోస్టర్ మీద 'They Call Him #OG' అని కాప్షన్ ఇచ్చారు. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. 'హీరో (పవన్ కళ్యాణ్)ను అందరూ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటారు' అనేది మీనింగ్. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ నీడను గన్ రూపంలో డిజైన్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ఆ విధంగా రివీల్ చేశారు.
Also Read : రెండు పార్టులు పవన్ 'అన్‌స్టాపబుల్ 2' సందడి - ఫస్ట్ పార్ట్ ఎప్పుడంటే?
ఆ పోస్టర్ మీద ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం ఏది? అంటే... జపనీస్ లైన్స్! ఆ జపనీస్ అక్షరాలకు అర్థం 'తుఫాను వస్తోంది' అని! ఢిల్లీ, జపాన్ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలిసింది. ఎర్రకోట, బుద్ధుడు, ఏరులై పారే రక్తం... పోస్టర్ మీద చిన్న చిన్న విషయాలను కూడా ప్రేక్షకులు గమనించారు.
Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?
ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చారిత్రక కథతో ఆ సినిమా రూపొందుతోంది. అలాగే, హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు కూడా పూజ చేశారు. అది తమిళంలో విజయ్, సమంత జంటగా నటించిన 'తెరి'కి రీమేక్. అయితే... కథకు హరీష్ శంకర్ తనదైన మార్పులు, చేర్పులు చేస్తున్నారట. మేనల్లుడు సాయి తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వం వహించనున్న 'వినోదయ సీతం' రీమేక్ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయట.